రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు స్టే
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:25 AM
జిల్లా రెడ్‌క్రాస్ సొసై టీలో ఈనెల 22న జరగాల్సిన కార్యవర్గ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్, స భ్యులు రాజీనామా చేశారు.
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా రెడ్‌క్రాస్ సొసై టీలో ఈనెల 22న జరగాల్సిన కార్యవర్గ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్, స భ్యులు రాజీనామా చేశారు. దీంతో కలెక్టర్ ఈనెల 22న ఎన్నికలు జరపా లని ప్రకటించారు. కానీ రెడ్‌క్రాస్‌లో ఇంకా ఐదుగురు సభ్యులు తమ పద వులకు రాజీనామా చేయలేదు. చైర్మన్ పదవికి ఆ సంస్థ వైస్‌చైర్మన్ డాక్టర్ చిట్యాల వెంకటేశ్వరరెడ్డి రెడ్‌క్రాస్ బైలా ప్రకారం చైర్మన్ అయ్యారు. అలాగే మిగిలిన మేనేజింగ్ కమిటీ సభ్యులు మిగతా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. కానీ బైలా ప్రకారం కానీ అలా జరగకుండా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎ న్నికలను ప్రకటించారు. దీంతో స్టేట్ రెడ్ క్రాస్, జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు బైలాకు విరుద్దమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు దీనిని పరిశీలించి తప్పుగా పరిగణించి ఈనెల 22న జరగాల్సిన ఎన్నికలను నిలుపుదల చేశారు. ఇప్పటి వరకు ఉన్న కమి టీనే కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చారు. కమిటి నిర్ణయం ప్రకారం నియ మ, నిబంధనలు పాటించాలని హైకోర్టు స్టే ఇచ్చింది.