Share News

డ్రైనేజీ నిర్మించాకే హైవే రోడ్డు పనులు

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:17 AM

డ్రైనేజీ నిర్మాణం చేపట్టిన తరువాతే నేషనల్‌ హైవే రోడ్డును ఏర్పాటు చేయాలని బాపట్ల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రకర్‌ జైన్‌ అన్నారు. జేసీ, ఆర్డీవో పి.గోరియా, ఆర్‌అండ్‌బీ, డ్రైనేజీ, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి కారంచేడు, పర్చూరు ప్రాంతాల్లోని రోడ్డు నిర్మాణ పనులను, వ్యవసాయ భూములను గురువారం పరిశీలించారు. వా

డ్రైనేజీ నిర్మించాకే హైవే రోడ్డు పనులు
రైతుల సమస్యలను తెలుసుకుంటున్న జేసీ ప్రకర్‌ జైన్‌

పంట పొలాలు ముంపునకు గురికాకుండా చర్యలు

అధికారులను ఆదేశించిన జేసీ జైన్‌

నష్టం లేకుండా చూడాలని రైతుల విజ్ఞప్తి

పర్చూరు, అక్టోబరు 3 : డ్రైనేజీ నిర్మాణం చేపట్టిన తరువాతే నేషనల్‌ హైవే రోడ్డును ఏర్పాటు చేయాలని బాపట్ల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రకర్‌ జైన్‌ అన్నారు. జేసీ, ఆర్డీవో పి.గోరియా, ఆర్‌అండ్‌బీ, డ్రైనేజీ, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి కారంచేడు, పర్చూరు ప్రాంతాల్లోని రోడ్డు నిర్మాణ పనులను, వ్యవసాయ భూములను గురువారం పరిశీలించారు. వాడరేడు - పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా పర్చూరు నుంచి కారంచేడు మీదుగా చేపడుతున్న హైవే నిర్మాణంలో డ్రైనేజీని ఏర్పాటు చేయకుండా రోడ్డు పనులు చేపడుతున్నారు. సమీప డ్రైనేజీ కాలువలను సైతం పూడ్చేసి రోడ్డు నిర్మాణం చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కొద్దిపాటి వరదలు, భారీ వర్షాలు సంభవిస్తే పొలాలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ సమస్యను కలెక్టర్‌ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. గతవారం రైతులు హైవే పనులను అడ్డుకున్నారు. రోడ్డు నిర్మాణంతో తమ పంట పొలాలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు జేసీ వద్ద మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జైన్‌ పూర్తిస్థాయిలో డ్రైనేజీని నిర్మించాకే రోడ్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు.

Updated Date - Oct 04 , 2024 | 12:17 AM