గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:26 PM
బొడ్డువానిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో బాలుడు మృతి చెందాడు.
అద్దంకి,డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికుల కధనం మేరకు మండలంలోని చక్రాయపాలెంకు చెందిన తిరుపతి నాగరాజు(26) మోటార్‌సైకిల్‌పై సోమవారం రాత్రి శింగరకొండ వైపు నుండి చక్రాయపాలెం వెళ్తుండగా భవనాసి చెరువు కట్ట వద్ద నామ్ రోడ్డులోకి వెళ్లే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనాస్థలాన్ని పోలీస్‌లు పరిశీలించారు. నాగరాజు చేపలవేట, కూలి పనులకు వెళ్ళి జీవనం సాగిస్తుంటాడు. ఇంకా వివాహం కాలేదు. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
మేదరమెట్ల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డువానిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బొడ్డువానిపాలెంలో సోమవారం గ్రామానికి చెందిన దుడ్డు గౌతమ్(4) అనే బాలుడు తాత నాగయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై బొడ్డురాయి దగ్గరకు వచ్చారు. అదే దారిలో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో బైక్‌పై ఉన్న తాత మనుమడును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌతం తలకు తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు హాస్పిటల్‌కు తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. తాతనాగయ్య పిర్యాదు మేరకు కొరిశపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.