Share News

ప్రజాపాలనకు ‘వంద ’నాలు

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:47 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ వందరోజుల పాలనకు పెద్దఎత్తున ప్రజామోదం లభిస్తున్నదని జడ్పీటీసీ మాజీ సభ్యుడు తుళ్లూరి నరసింహారావు అన్నారు.

ప్రజాపాలనకు ‘వంద ’నాలు
టంగుటూరు రామాలయం వీధిలో ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు జయంత్‌బాబు, విజయకుమార్‌, బెజవాడ వెంకటేశ్వర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగులు

మర్రిపూడి, సెప్టెంబరు 20 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వ వందరోజుల పాలనకు పెద్దఎత్తున ప్రజామోదం లభిస్తున్నదని జడ్పీటీసీ మాజీ సభ్యుడు తుళ్లూరి నరసింహారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మర్రిపూడిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వందరోజుల పాలనలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మెగా డీఎస్సీని ప్రకటించారన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు పింఛన్‌ సొమ్మును పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించడంతోపాటు ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం, అన్న క్యాంటీన్‌ల ప్రారంభం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని కొనియాడారు. మండలంలో అధికారులతోపాటు టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనడం శుభపరిణామమన్నారు. మర్రిపూడిలో తహసీల్దార్‌ ఎం.జ్వాలానరసింహారావు, పన్నూరులో ఎంపీడీవో సాంబశివరావుతోపాటు టీడీపీ నాయకులు రేగుల వీరనారాయణ, గొంటు హనుమారెడ్డి, చేరెడ్డి నర్సారెడ్డి, కె మోహన్‌రావ్‌, శ్రీనివాసులు, చెరెడ్డి రమేష్‌, ధర్మవరం శ్రీనివాసరెడ్డి అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


టంగుటూరులో..

టంగుటూరు : టంగుటూరులో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్‌ మద్దిరాల మమత, మాజీ సర్పంచ్‌ బెల్లం జయంత్‌బాబు, టీడీపీ మండల అధ్యక్షుడు కామని విజయకుమార్‌, తెలుగు రైతు రాష్ట్ర నేత బెజవాడ వెంకటేశ్వర్లు, మాజీ ఉపసర్పంచ్‌ మక్కెన కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి జగదీష్‌, గ్రామ సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. వీరంతా రామాలయం వీధిలో ప్రచారం చేశారు. అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సచివాలయ ఉద్యోగులతోపాటు ఉపసర్పంచ్‌ కసుకుర్తి భాస్కరరావు, టీడీపీ నాయకుడు జయరావు పాల్గొన్నారు. అక్కడి సంఘంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కాకుటూరివారిపాలెంలో చేపట్టిన ఇంటింటి ప్రచారంలో సర్పంచ్‌ కొమ్మినేని రమణమ్మతోపాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు కమ్మ రోశయ్య, పిడికిటి యలమంద, షేక్‌ బ్రహ్మయ్య, గుడిపూడి రవీంద్ర, లింగాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. జయవరంలో గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి టీడీపీ కూటమి నాయకులు యరమోసు సుధాకర్‌ తదితరులు ప్రచారం నిర్వహించారు. మర్లపాడులో జరిగిన ప్రచారంలో తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి కొమ్ము వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యుడు చుండూరి వేణు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముత్తినేని హరిబాబు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:47 PM