Share News

వైసీపీ పాలనలో అడ్డగోలుగా విద్యుత్‌ చార్జీలు పెంపుదల

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:11 PM

గత వైసీపీ ఐదేళ్ళ పాలనలో అడ్డగోలుగా అనేకసార్లు విద్యత్‌ చార్జీలు పెంచిన విషయాన్ని మరచి ఇప్పుడు తగ్గించాలని నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం శోచనీయమని దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌ చైర్మన్‌ జి.స్టీవెన్‌ తదితరులు విమర్శించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ పాలకులు 13 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని పెనుభారం మోపిన విషయాన్ని గుర్తు చేశారు.

వైసీపీ పాలనలో అడ్డగోలుగా విద్యుత్‌ చార్జీలు పెంపుదల
మాట్లాడుతున్న నగరపంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య తదితరులు

దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి ధ్వజం

దర్శి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ఐదేళ్ళ పాలనలో అడ్డగోలుగా అనేకసార్లు విద్యత్‌ చార్జీలు పెంచిన విషయాన్ని మరచి ఇప్పుడు తగ్గించాలని నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం శోచనీయమని దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్‌ చైర్మన్‌ జి.స్టీవెన్‌ తదితరులు విమర్శించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ పాలకులు 13 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని పెనుభారం మోపిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ పాలకుల అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని త్రిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కౌన్సిలర్లు వీసీ రెడ్డి, ఇత్తడి దినకర్‌, దర్శి డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ కె. వెలుగొండారెడ్డి, గొర్రె సుబ్బారెడి,్డ పుల్లలచెరువు చిన్నా, మారెళ్ల వెంకటేశ్వర్లు, సుభానీ, సానె సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన చేపట్టటం సిగ్గుచేటు

దర్శి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలకులు పెంచిన విద్యుత్‌ చార్జీలను ఇప్పుడు తగ్గించాలని ఆ పార్టీ నాయకులు ఆందోళనకు పిలుపునివ్వటం సిగ్గుచేటని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాల కేసుల నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకు నిరసన కార్యక్రమాల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సౌరవిద్యుత్‌ ఒప్పందాల్లో ముడుపులు కేసుల్లో అమెరికాలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ అధినేత జగన్‌ పోరుబాట పేరట ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారని, దొంగ నిరసన కార్యక్రమాలు చేపట్టే నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.

విద్యుత్‌ చార్జీలు పెంచిన ఘనత వైసీపీదే!

కనిగిరి : విద్యుత్‌ చార్జీల పెంపు పాపం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదేనని టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి తమ్మినేని వెంకటరెడ్డి అన్నారు. గురువారం స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ అసమర్ధ ఐదేళ్ళ పాలనతో ప్రజలపై 1.29 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్‌ భారం ప్రజలపై పడిందన్నారు. ఈ నిజాలన్నింటిని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఐదేళ్ళ పాలనలో 13 సార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. పోలవరం హైడ్రో ఎలక్ర్టిక్‌ ప్రాజెక్టు జాప్యంతో రూ.4వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్ళతో రూ.2 వేల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా బూటకపు మాటలు మానుకోవాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు తమ్మినేని శ్రీనివాసులురెడ్డి, ఫిరోజ్‌, షేక్‌ వాజిదాబేగం, కరణం అరుణ, తులసి, దొరసాని, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 11:11 PM