Share News

ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:27 PM

గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని మాదిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. గురువారం సాయంత్రం ఒంగోలులోని ప్రగతిభవన్‌లో గల ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు.

ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం
రికార్డులను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ శ్రీదేవి

మాదిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ శ్రీదేవి ధ్వజం

ఒంగోలు నగరం, డిసెంబరు19(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని మాదిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. గురువారం సాయంత్రం ఒంగోలులోని ప్రగతిభవన్‌లో గల ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి జగన్‌ ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించకుంచకుండా దళితులుకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీల నిధులను దారి మళ్లించి దళితద్రోహిగా మిగిలి పోయాయరని మండిపడ్డారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఎస్సీ కార్పొరేషన్‌కు సీఎం చంద్రబాబు రూ.300కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులతో అర్హులైన ఎస్సీలకు త్వరలోనే యూనిట్‌లను అందజేస్తామని చెప్పారు. గతంలో రుణాలు తీసుకున్న లబ్ధిదారులు నుంచి బకాయిలు వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈడీ అర్జున్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:27 PM