Share News

కాపుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:39 AM

పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులోని బలిజ సేవాసంఘం నూతనంగా నిర్మించిన మిని కల్యాణ మండపాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

కాపుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా

గిద్దలూరుటౌన్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులోని బలిజ సేవాసంఘం నూతనంగా నిర్మించిన మిని కల్యాణ మండపాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తు ముల అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కాపుల అభివృద్ధికి తనపూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, కంభం మండల కేంద్రాలలో కాపు భవ న నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నట్లు తెలిపారు. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులను మధ్యలోనే ఆపివేసింద న్నారు. తిరిగి ఆ భవనాల పూర్తికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కాపు సంఘం ప్రతినిధులు సన్మానించారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కుప్పా రంగనాయకులు, కాపు సంఘం ప్రతినిధులు దుత్తా బాలీశ్వరయ్య, ఆర్‌డీ.రామక్రిష్ణ, కమతం శ్రీనివాసులు, యగటీల రంగస్వామి, ముద్దర్ల శ్రీనివాసులు, యగటీల రవి, పసుపులేటి శ్రీనివాస్‌, బాలచెన్నయ్య పాల్గొన్నారు.

టార్పాలిన్‌ పట్టలు దుప్పట్లు పంపిణీ

గిద్దలూరు టౌన్‌ : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మండ లంలోని దిగువమెట్ట చెంచుకాలనీ లోని 100 చెంచు కుటుంబాలకు టార్పాలిన్‌ పట్టలను, దుప్పట్లను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అందజేశారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందా లని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చెంచులకు సూచించారు. చెంచుకుటుంబాల వారు తమ పిల్లలను తమతోపాటు పనులకు తీసుకుని వెళ్లకుండా కచ్చితంగా పాఠశాలలకు పంపాలన్నారు. హాస్టళ్లలో ఉంచి చదివించుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో సొసైటీ రాష్ట్ర కోశాధికారి చిట్యాల వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పాలుగుళ్ల ప్రతాపరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

కంభం : కంభం అంకాలమ్మ దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం శ్రీ అభయాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యుడైన ఆకుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటుకు ముందు ఉదయం గణపతి పూజ, పంచామృతాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొని శాంతిహోమం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అంకాలమ్మగుడి నుంచి కంభం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

Updated Date - Nov 11 , 2024 | 12:39 AM