Share News

ఈనాం భూములను పరిశీలించిన జేసీ

ABN , Publish Date - Nov 14 , 2024 | 10:53 PM

మండలంలోని లక్కవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈనాం భూములను గురువారం సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ మండల రెవెన్యూ, సర్వే అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఈ రెవెన్యూ పరిధిలో 569 ఎకరాలు ఈనాం భూములు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పొలాలను రైతులు సాగుచేసుకుంటున్నారు. రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు గాని ఇతరత్రా ఎలాంటి భూమి హక్కుపత్రాలు లేవు.

ఈనాం భూములను పరిశీలించిన జేసీ
రైతులతో మాట్లాడుతున్న జేసీ ప్రఖర్‌ జైన్‌

మార్టూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని లక్కవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈనాం భూములను గురువారం సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ మండల రెవెన్యూ, సర్వే అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఈ రెవెన్యూ పరిధిలో 569 ఎకరాలు ఈనాం భూములు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పొలాలను రైతులు సాగుచేసుకుంటున్నారు. రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు గాని ఇతరత్రా ఎలాంటి భూమి హక్కుపత్రాలు లేవు. దీంతో రైతులు తమ భూములను సర్వేచేసి పాస్‌ పుస్తకాలు ఇప్పించాలని సంబందిత అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రైతుల ఈనాంభూముల సమస్యను కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జేసీ ప్రఖర్‌ జైన్‌ ఈనాం భూములను పరిశీలించారు. అనంతరం ద్రోణాదుల గ్రామంలో జేసీ కొంతమంది రైతులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వేలో 495 మంది రైతులు తమ పొలాలకు సంబందించి తప్పులు నమోదయ్యాయని, ఇటీవల జరిగిన గ్రామ సభలో ఫిర్యాదు చేశారు. దాంతో జేసీ బాధిత రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ టీ ప్రశాంతి, సర్వే ఏడీ కనక ప్రసాదరావు, డీఐఓఎస్‌ శ్రీనివాసరావు, సర్వేయరు ఏడుకొండలు, స్థానిక రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 10:53 PM