Share News

సమాజ అభివృద్ధిలో వారధిగా జర్నలిస్టులు

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:51 AM

సమాజ అభివృ ద్ధిలో వారధిగా జర్నలిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బా రావు పేర్కొన్నారు. శ

సమాజ అభివృద్ధిలో వారధిగా జర్నలిస్టులు

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావు

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సమాజ అభివృ ద్ధిలో వారధిగా జర్నలిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బా రావు పేర్కొన్నారు. శనివారం జాతీ య పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో యూని యన్‌ ఆధ్వర్యంలో స్థానిక కుష్టువ్యాధిగ్రస్తులకు దుస్తులు పంపిణీ చేశారు. యూనియన్‌ కార్యదర్శి దాసరి కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐవీ మాట్లాడుతూ వేజ్‌ బో ర్డు ఆదేశాలు అమలు చేయకపోవడంతో జర్నలిస్టులకు కనీస జీతభత్యాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వివక్షతతో కనీసం అక్రిడిటేషన్‌ కార్డులు కూ డా మంజూరు కాలేదని చెప్పారు. వచ్చే జనవరి నాటికి నూతన అక్రిడిడేషన్‌ కార్డులు అ ర్హులైన వారందరికీ మంజూరు చేసేలా ప్రభుత్వం, సమాచారశాఖ మంత్రి హామీ ఇచ్చార ని ఐవీ తెలిపారు. అనంతరం రోగులకు దుప్పట్లు, టవళ్లు, పండ్లు పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో ఆలుగుల సురేష్‌, బి.వెంకట్రావు, శంకర్‌, శ్రీనివాసరావు, మురళీ, శ్రీనివాసరావు, కోటిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కారుసాల అశోక్‌, బేతాళ శ్రీనివాసరావు, డాక్టర్‌ కాట్రగడ్డ రజిత, మానస, ఎల్‌టీ.కృష్ణలీల, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:51 AM