Share News

‘కనిగిరి’ అభివృద్ధే లక్ష్యం: ఉగ్ర

ABN , Publish Date - May 03 , 2024 | 12:03 AM

కనిగిరి నియోజకవర్గ అభి వృద్ధే తన లక్ష్యమని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో గురువారం కని గిరి మండలం వాగుపల్లికి చెందిన 35 కు టుంబాలు, సీఎస్‌పురం మండల కేంద్రానికి చెందిన 15 కుటుంబాలు, వెంకటయ్యచెరువు గ్రామానికి చెందిన 21 కుటుంబాలు, వెలిగం డ్ల మండలం గన్నవ రం గ్రామానికి చెంది న 12 కుటుంబాలు వైసీపీని టీడీపీలో చేరారు.

‘కనిగిరి’ అభివృద్ధే లక్ష్యం: ఉగ్ర
డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరిన కనిగిరి మండలం వాగుపల్లి గ్రామస్థులు

కనిగిరి, మే 2: కనిగిరి నియోజకవర్గ అభి వృద్ధే తన లక్ష్యమని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో గురువారం కని గిరి మండలం వాగుపల్లికి చెందిన 35 కు టుంబాలు, సీఎస్‌పురం మండల కేంద్రానికి చెందిన 15 కుటుంబాలు, వెంకటయ్యచెరువు గ్రామానికి చెందిన 21 కుటుంబాలు, వెలిగం డ్ల మండలం గన్నవ రం గ్రామానికి చెంది న 12 కుటుంబాలు వైసీపీని టీడీపీలో చేరారు. ఈసందర్భం గా డాక్టర్‌ ఉగ్ర మా ట్లాడుతూ కనిగిరి ప్రాంతాభివృద్ధికి కు లమతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని గె లిపించుకోవాల్సిన అవ సరం ఉందన్నారు. వ చ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటమి తప్పదన్నారు. టీడీపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను, ప్రజాసంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. కనిగిరి అ భివృద్ధి జరగాలంటే విద్య, ఉపాధి, ఉద్యోగ, వ్య వసాయ, వైద్య రంగాలు కనిగిరి ప్రాంతానికి చేరువ కావాలన్నారు. అం దుకోసం తాను కృతనిశ్చయంతో ఉన్నానన్నా రు. కనిగిరి అభివృద్ధి కోసం సూపర్‌ ఫైవ్‌ ప్ర ణాళికలతో ముందుకువెళుతున్నట్టు చెప్పారు.

కనిగిరి మండలం వాగుపల్లి గ్రామానికి చెందిన మూప్పూరి సాలమ్మ, నూకతోటి పెద్ద చెన్నయ్య, సంపూర్ణ, అంకయ్య, పూజల రమ ణయ్య, కృష్ణారావు, ఆంజనేయులతో పాటు 35 కుటుంబాలు ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎస్‌పురం మండలం కేంద్రానికి చెందిన 15 కుటుంబాలు, బోయమడుగుల పంచాయతీ వెంకటయ్యచెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ కుక్కల రమణయ్య, రావుల రావయ్య, రావుల గురవయ్య, చినగురవయ్యతో పాటు 15కుటుంబాలు చేరారు.

అలాగే, వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన 12 కుటుంబాలు పార్టీలో చేరారు. వారికి డాక్టర్‌ ఉగ్ర టీడీపీ కండు వాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Updated Date - May 03 , 2024 | 12:03 AM