జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు కేవీపల్లి విద్యార్థిన ఎంపిక
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:52 PM
జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు కంచర్లవారిపల్లి హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఎంపికైనట్లు హెచ్‌ఎం విజయభాస్కర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 2 నుంచి 4 వరకు అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీల్లో కంచర్లవారిపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి కల్యాణి పాల్గొన్నారు.
కనిగిరి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు కంచర్లవారిపల్లి హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఎంపికైనట్లు హెచ్‌ఎం విజయభాస్కర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 2 నుంచి 4 వరకు అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీల్లో కంచర్లవారిపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి కల్యాణి పాల్గొన్నారు. ఈపోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈసందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మన్‌లు, పీడీ కాశీవిశ్వనాధ్‌రెడ్డి కల్యాణిని అభినందించి సత్కరించారు.