Share News

భూకబ్జాదారుల భరతం పడతాం

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:35 PM

గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలకు పాల్పడిన వారి భరతం పడ తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

భూకబ్జాదారుల భరతం పడతాం

తర్లుపాడు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలకు పాల్పడిన వారి భరతం పడ తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని సీతానాగులవరం, సూరెపల్లిలో రెవెన్యూ గ్రామసభలు నిర్వహించారు. సీతానాగులవరం రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భూములు అడ్డగోలుగా కొట్టేసిన వారి భరతం పట్టేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి ప్రజలకు సాగు, తాగు నీరు అందించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసు కుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా మార్కాపురం జిల్లా త్వరలో చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా అయితే సీతానాగులవరం ఎంతో అభివృద్ధి చెందుతుంద న్నారు. ఈ సందర్భంగా సీతానాగులవరంలో పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఎన్టీఆర్‌ కాలనీ రహదారికి వైసీపీ నాయకులు అడ్డుపడు తున్నారని, సచివాలయం వెనుకున్న రహదారికి కంచె వేశారని, కొందరు భూములు ఆన్‌లైన్‌లో తక్కువగా ఉన్నాయని పలు సమస్యలపై అర్జీలు ఇచ్చారు. వెంటనే సచివాలయం వెనుకునున్న కంచెను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం తహ సీల్దార్‌, ఎంపీడీవో పలువురు సర్వేయర్లు సచివాలయం వెనుకున్న రహదారికి ఉన్న కంచెను తొలగించారు. దీంతో సమస్యను పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సీతానాగులవరంలో వివిధ సమస్యలపై 25, సూరెపల్లిలో 10 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్‌ విజయభాస్కర్‌ పేర్కొన్నారు. అర్జీలకు రసీదులు ఇచ్చి 45 రోజుల్లోపు పరిష్కరించనున్నట్లు తహసీ ల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో చక్రపాణి ప్రసాద్‌, మండల సర్వేయర్‌ సురేష్‌, ఈవోఆర్‌డీ సుకుమార్‌, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మార్కాపురం రూరల్‌ : ప్రజల భూముల సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు ఎమ్మె ల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని నికరంపల్లి గ్రామంలో సోమవారం తహసీల్దార్‌ ఆధ్వ ర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే నారాయణరెడ్డి హాజరై మాట్లాడుతూ, కబ్జా దారులపై చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్ట పరమైన కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు. మా ర్కాపురం వైసీపీ నాయకులు చివరకు చెన్నకేశవ స్వా మి ఆలయ భూములను కూడా వదల్లేదని త్వరలోనే ఆలయ భూములను దేవదాయశాఖ స్వాదీనం చేసు కొని దేవస్థానానికి అప్పగిస్తుందన్నారు. మార్కాపురం జిల్లా త్వరలోనే సాకారం అవుతుందని తద్వారా రైతుల భూములకు మంచిధరలు వస్తాయన్నారు. కార్యక్రమం లో శ్రీలక్ష్మీచెన్నవేశవ స్వామి ఆలయ ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి, టీడీపీ గ్రామ నాయకులు సుబ్బారెడ్డి, టీడీపీ పట్టణ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సుకు 8 అర్జీలు

ఎర్రగొండపాలెం రూరల్‌ : మండలంలోని కొలుకుల గ్రామంలో డీటీ నలగాటి మల్లికార్జుననాయుడు అధ్వ ర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మొత్తం 8 అర్జీలు వచ్చాయి. మ్యూటెషన్‌ కోసం 7, పోజిషన్‌ సర్టిఫికెట్‌ కోసం 1 దరఖాస్తులు వచ్చాయి. ముటేషన్‌ ధ్రువీకరణ పత్రాలు అక్కడిక్కడే అందేజేశా మన్నారు. కార్యక్రమంలో వీఆర్‌వోలు బాలేశ్వర్‌, చెన్న య్య, ఖాదర్‌వలి, సర్వేయర్లు సాయికృష్ణ, వెంకటేశ్వరరెడ్డి సీవో రత్నం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:35 PM