Share News

జువ్వలగుంట చెరువుకు గండి

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:20 AM

మండ లంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని జువ్వలగుంట చెరువుకు శుక్రవారం తెల్లవారు జూమున భారీ గండిపడింది. దీంతో చెరువులోకి చేరిన నీరంతా వృథాగా బయటకు పోయింది.

జువ్వలగుంట చెరువుకు గండి
చెరువుకు పడిన గండి నుంచి బయటకు వెళ్తున్న నీరు

వృథాగాపోయిన వర్షపు నీరు

సింగరాయకొండ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మండ లంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని జువ్వలగుంట చెరువుకు శుక్రవారం తెల్లవారు జూమున భారీ గండిపడింది. దీంతో చెరువులోకి చేరిన నీరంతా వృథాగా బయటకు పోయింది. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ టి.రవి, ఇరిగేషన్‌ అధికారులు చెరువు వద్దకు చేరుకొని గండిని పరిశీలించారు. నీటి ఉధృతి తగ్గిన వెంటనే దాన్ని పూడుస్తామని రైతులకు ఇరిగేషన్‌ అధికారులు భరోసా కల్పించారు.

Updated Date - Nov 16 , 2024 | 01:20 AM