తెప్పోత్సవాన్ని విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:57 AM
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి మార్కాపరంలోని పుష్కరిణిలో జరిగే చెన్నయ్య తెప్పోత్సవాన్ని విజయవంతం చేయా లని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ అన్నారు.
మార్కాపురం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి మార్కాపరంలోని పుష్కరిణిలో జరిగే చెన్నయ్య తెప్పోత్సవాన్ని విజయవంతం చేయా లని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ అన్నారు. స్థానిక పుష్కరిణి వద్ద మంగళవారం జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. చెరువు నుంచి నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. తెప్పో త్సవం బుధవారం మధ్యాహ్నం జరుగుతుంద న్నారు. అప్పటి వరకు నీటిని పంపింగ్ చేయ నున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా తెప్పోత్సవం జరిగే సమయంలో ప్రజలు నీటివద్దకు వెళ్లకుండా బారి కేడ్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. డివి జన్ పరిధిలోని పోలీసు సిబ్బంది కూడా విధుల్లో ఉంటారని సీఐ సుబ్బారావు తెలిపారు. తెప్పోత్సవం నీటిలోకి దిగి ప్రమాదాల బారినపడ కుండా పోలీసు సిబ్బందిని అక్కడ ఉంచాల న్నారు. కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖల అధికా రులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సీఐ సుబ్బారావు, ఆలయ ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.