ఘనంగా నీలంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:04 AM
తర్లుపాడులో వెలసిన శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి 14వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
తర్లుపాడు, జూన్ 11: తర్లుపాడులో వెలసిన శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి 14వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఓరుగంటి వెంకట ప్రసాద్‌శర్మ, పవన్‌కుమార్‌శర్మల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మ వారికి తర్లుపాడు పురవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి భజన కార్యక్రమం సిరిగిరిపాడు బృందంతో నిర్వహిం చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలా ది మంది భక్తులు అమ్మవారిని దర్శించు కొని తీర్థ ప్రసాదాలు స్వీకరిం చారు. ఈ మహోత్సవం సంద ర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు.