Share News

గ్రామీణ రహదారులకు మహర్దశ

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:46 PM

కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. గ్రామాల్లో ఒక్క రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదు. దీంతో గ్రామాల్లోని రహదారులు గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టకపోవడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో మురికికూపాలుగా మారాయి.

గ్రామీణ రహదారులకు మహర్దశ
శివరాంపురం ఎస్సీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డు

గల వైసీపీ పాలనలో అధ్వానంగా మారిన వైనం

కూటమి ప్రభుత్వంలో నిధుల వరద

తాళ్లూరు మండలంలో 58 పనులకు రూ.3 కోట్లు మంజూరు

తాళ్లూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. గ్రామాల్లో ఒక్క రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదు. దీంతో గ్రామాల్లోని రహదారులు గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టకపోవడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో మురికికూపాలుగా మారాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పల్లెలకు పండుగ వాతావరణం తీసుకువచ్చారు.పల్లె పండుగ పేరుతో గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, సైడు కాలువల నిర్మాణాలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ప్రత్యేక కృషితో మండలంలోని 16 పంచాయతీల్లో సీసీ రోడ్లు, సైడు కాలువ నిర్మాణం వంటి 58 పనులకు రూ.3 కోట్లు మంజూరు చేయించారు. నాలుగైదు గ్రామాల్లో మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో పనులు చకచకా సాగుతున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరుకాక ఆపార్టీ సర్పంచ్‌లు కూడా అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పంచాయతీల్లోని రహదారులు, సైడుకాలువ పనులు జరుగుతుండటంతో తమ పదవీ కాలం ముగిసేలోపు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వైసీపీ సర్పంచ్‌లే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికే 24 పనులు పూర్తికాగా, మిగిలిన పనులు నిర్మాణ దశల్లో ఉన్నాయి. గ్రామీణప్రాంతాల్లో అంతర్గత రోడ్లు మునుపెన్నడూ లేనంతగా చకచకగా జరుగుతుండటంతో కూటమి ప్రభుత్వం వల్ల ప్రజల కష్టాలు తొలుగుతున్నాయని గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాలనీలో రోడ్డుకు మోక్షం

- అనపర్తి ఎఫ్రయిమ్‌, శివరాంపురం

శివరాంపురం ఎస్సీ కాలనీలో రో డ్లు దుస్థితిలో ఉన్నా గత ఐదేళ్ల వైసీ పీ పాలనలో కనీసం ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతర్గత రోడ్లనిర్మాణంపై దృష్టి సారించారు. నిధులు మంజూరుచేయగా, రోడ్డు నిర్మాణం చేశారు. దీంతో ఎస్సీ కాలనీ వాసుల కష్టాలు తొలగినట్లయ్యాయి.

హామీలు నెరవేరుస్తున్నారు

- జాష్టి శ్రీనివాసులు, తూర్పుగంగవరం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామాల్లో సీసీ రోడ్లు, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేరుస్తూ గ్రామాల్లో అంతర్గత రోడ్లు, సైడుల కాలువల నిర్మాణం, గోకులం వంటి పనులకు కోట్లాది రూపాయలు మంజూరుచేశారు. దీంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో మౌలిక సదుపాలయాలు కల్పించటం అభినందనీయం.

త్వరితగతిన పూర్తిచేస్తాం

- ఎంవెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌ ఏఈ, తాళ్లూరు

మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లనిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా 58 పనులకు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. రెండు మూడు గ్రామాలు మినహా అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించారు.

24 పనులు పూర్తికాగా మిగిలినవి నిర్మాణ దశల్లో ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల సమన్వయంతో పనులు ముందుకు సాగుతున్నాయి. సంక్రాంతి నాటికి అన్ని పల్లెల్లో పండుగ వాతావరణంలో రోడ్లకు శంకుస్థాపన కార్యాక్రమాలు జరిగేందుకు కృషి చేస్తున్నాం.

Updated Date - Dec 22 , 2024 | 11:46 PM