21న మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
ABN , Publish Date - Jul 09 , 2024 | 10:52 PM
: ఈనెల 21 మెగా ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వ ర్గాలు మంగళవారం ప్రకటనలో తెలిపారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జననీ చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని పరిసరప్రాంత ప్రజలు విని యోగించుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే ఉగ్ర ఆధ్వర్యంలో నిర్వహణ
కనిగిరి, జూలై 9 : ఈనెల 21 మెగా ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వ ర్గాలు మంగళవారం ప్రకటనలో తెలిపారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో జననీ చారిటబుల్ ట్రస్ట్, శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని పరిసరప్రాంత ప్రజలు విని యోగించుకోవాలని కోరారు. ఈ కంటి చికిత్స కేవలం పేదవారికి మాత్రమేనని, శిబిరానికి వచ్చే కంటి సంబంద బాధితులు గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఓటరుకార్డు జిరాక్స్ కాపీలని వెంట తెచ్చుకోవాలని తెలిపారు. తప్పనిసరిగా సెల్‌ఫోన్ నెంబరును తీసుకురావాలని కోరారు. కంటి శుక్లములతో బాధపడే పేదలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 738260 1555, 7095601555 నెంబరులను సంప్రదించాలని కోరారు.