Share News

సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:54 PM

టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న సభ్యత్వ నమోదును పార్టీ శ్రేణులు విజయవంతం చేయాల ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.

సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న సభ్యత్వ నమోదును పార్టీ శ్రేణులు విజయవంతం చేయాల ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి పార్టీ కార్యాల యం వద్ద ఆరు మండలాల ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సమావేశ మయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నవంబరు 26వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ సభ్యత్వం శ్రేణులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. నూతన సభ్యత్వ విధానంలో సభ్యత్వం చేసుకున్న వారికి ప్రమాద బీమా రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.10వేలు వర్తిస్తుందన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు, సానుభూతి పరులకు పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి గతంలో జరిగిన నమోదు కంటే అత్యధికంగా నమోదు చేపించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీల నాయకులు పాల్గొన్నారు.

టీడీపీతోనే గ్రామాల అభివృద్ధి

కొమరోలు : టీడీపీతోనే గ్రామాల అభివృధ్ధి సా ధ్యపడుతుందని ఆ పార్టీ నాయకులు గోడి ఓబుల్‌ రెడ్డి, యల్లారెడ్డిలు అన్నారు. మండలంలోని బాది నేనిపల్లి గ్రామంలో రూ.10 లక్షల నిధులతో సిమెంట్‌ రోడ్లకు భూమి పూజలు చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లతోపాటు గ్రామం లో మురగునీరు బయటకు పోవడానికి సైడు కాలువలకు ప్రతిపాదనలు పంపామన్నారు. బాది నేనిపల్లెలో ఆరోగ్య సబ్‌పెంటర్‌కు సొంత భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్పంచ్‌ ముత్తుముల జయరామిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. కార్య క్రమంలో పీఆర్‌ ఏఈ వీరయ్య, ఈసీ కోటిరెడ్డి, కార్యదర్శి బండి.కారుణ్య, అహల్యారాణి, సచివాలయ సిబ్బంది, నాయకులు లక్ష్మిరంగారెడ్డి, పోలెబోయిన రమణ, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కంభం (అర్ధవీడు) : రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తు ముల అశోక్‌రెడ్డి తెలిపారు. సోమవారం అర్ధవీడు మండలంలో రూ.1.25 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధే లక్ష్యం గా టీడీపీ కూటమి ప్రభుత్వం పల్లెపండుగ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. అర్ధవీడు మండలంలో మొహిద్దీన్‌పురం, అర్ధవీడు, పాపినేని పల్లెలో అంతర్గత సీసీరోడ్లకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంంలో పంచాయతీరాజ్‌ డీఈ సుబ్బారెడ్డి, ఎంపీడీవో నరసయ్య, మాజీ ఎంపీపీ చేగిరెడ్డి కాశిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు, బండి నారాయణరెడ్డి, సాగర్‌, దిబ్బయ్య, ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:54 PM