సెక్టోరల్ పోస్టులకు సగం మందికిపైన అనర్హులే!
ABN , Publish Date - Nov 06 , 2024 | 01:13 AM
సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న సెక్టోరల్ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికిపైన అనర్హులుగా తేలారు. మొత్తం ఆరు పోస్టులకు 58మంది స్కూలు అసిస్టెంట్లు దరఖాస్తు చేయగా వీరిలో 26మంది మాత్రమే అర్హులని నిర్ధారించారు. 32మంది అర్హత లేని వారిగా గుర్తించారు. సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టులో సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల పోస్టులు ఉన్నాయి.
ఆరింటికి 26మంది అర్హులు
అర్హతలేని 32 మంది దరఖాస్తు
ఒంగోలు విద్య, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న సెక్టోరల్ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికిపైన అనర్హులుగా తేలారు. మొత్తం ఆరు పోస్టులకు 58మంది స్కూలు అసిస్టెంట్లు దరఖాస్తు చేయగా వీరిలో 26మంది మాత్రమే అర్హులని నిర్ధారించారు. 32మంది అర్హత లేని వారిగా గుర్తించారు. సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టులో సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏఎంవో, ఏపీవో పోస్టుల్లో గతంలో నియమితులైన వారు కొనసాగుతుండగా మిగిలిన ఐదు సెక్టోరల్, ఒక అసిస్టెంట్ సెక్టోరల్ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నాయి. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ డీఈవో ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎంవో, ఐఈ కోఆర్డినేటర్, ఏఎల్‌ఎస్ కోఆర్డినేటర్, జీసీడీవో, ఎంఐఎస్ అండ్ ప్లానింగ్ కోఆర్డినేటర్ సెక్టోరల్ పోస్టులు, ఏఎస్‌వో అసి స్టెంట్ సెక్టోరల్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వా నించారు. అయితే పూర్వ కలెక్టర్ దినేష్‌కుమార్ ఉన్నప్పుడే నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే దానిని నిలిపివేసి తాజాగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ ఇచ్చారు.
సగం మందికిపైగా అనర్హులు
సమగ్ర శిక్షలోని ఆరు సెక్టోరల్ పోస్టులకు 58మంది, స్కూలు అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకున్నారు. సీఎంవో పోస్టుకు అత్యధికంగా 17మంది, జీసీడీవో పోస్టుకు అతి తక్కువగా కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. సీఎంవో పోస్టుకు దరఖాస్తు చేసిన 17 మందిలో పది మంది అర్హులు కాగా ఏడుగురు అనర్హులు. ఐఈ కోఆర్డినేటర్ పోస్టుకు ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో ఇద్దరు మాత్రమే అర్హులు కాగా ఆరుగురు అనర్హులు. ఏఎల్‌ఎస్ కోఆర్డినేటర్ పోస్టుకు 14మందిలో ఆరుగురు అర్హులు కాగా 8మంది అనర్హులుగా తేలారు. జీసీడీవో పోస్టుకు ఇద్దరిని అర్హులుగా గుర్తించారు. ఎంఈస్‌అండ్ ప్లానింగ్ కోఆర్డినేటర్ పోస్టుకు తొమ్మిది మంది దరఖాస్తు చేయగా వీరిలో ముగ్గురు అర్హులు కాగా ఆరుగురు అనర్హులు. ఏఎన్‌వో పోస్టుకు ఎనిమది మంది దరఖాస్తు చేసుకోగా ముగ్గురు అర్హులు, ఐదుగురు అనర్హులుగా తేలారు. సెక్టోరల్ పోస్టులకు కొన్ని అర్హతలను నిర్దేశించారు. గతంలో ఐదు సంవత్సరాలకుపైగా ప్రాజెక్టులో పనిచేసిన వారు అనర్హులు. అదేవిధంగా స్కూలు అసిస్టెంట్‌గా కనీసం ఎనిమిది సంవత్సరాలు సర్వీసు కలిగి స్థానికులై ఉండాలి. 58 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి. కొన్ని పోస్టులకు పీజీ విద్యార్హతలు. ఎంఐఎన్‌అండ్ ప్లానింగ్ కోఆర్డినేటర్ పోస్టుకు గణితంలో స్టాటిస్టిక్స్, కంప్యూటర్ కోర్సు ఉండాలి. ఈ అర్హతలు లేని వారిని అనర్హులుగా ప్రకటించారు.