తల్లీ బిడ్డ సంరక్షణలో ‘ఎన్‌ఎంసీయూ’ కీలకపాత్ర
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:25 PM
తల్లీబిడ్డ సంరక్షణలో ఎన్‌ఎంసీయూ, కేఎంసీ (కంగారు మదర్ కేర్) యూనిట్ కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారీయా పేర్కొన్నారు. దీనికోసం కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పైలట్‌ప్రాజెక్టుగా తీసుకున్నామని తెలిపారు.
కలెక్టర్ అన్సారియా
ఒంగోలు (కార్పొరేషన్), అక్టోబరు 1: తల్లీబిడ్డ సంరక్షణలో ఎన్‌ఎంసీయూ, కేఎంసీ (కంగారు మదర్ కేర్) యూనిట్ కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారీయా పేర్కొన్నారు. దీనికోసం కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పైలట్‌ప్రాజెక్టుగా తీసుకున్నామని తెలిపారు. ఎన్‌ఎంసీయూ, కేఎంసీకే సంబంధించిన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఒంగోలులోని జీజీహెచ్‌లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి సౌకర్యాలతో కూడిన వైద్యం తల్లీ బిడ్డకు అందించాలన్న లక్ష్యంతో కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. వసతులతో పాటు మంచి నైపుణ్యం, నిబద్ధత గల సిబ్బంది వల్ల మాత్రమే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఇందులో స్టాఫ్ నర్సుల పాత్ర అధికంగా ఉంటుందని, వారి సామర్ధ్యం పెంపు కోసం ఈ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. రిసోర్స్‌పర్సన్‌లు, నర్సింగ్ సిబ్బందికి శిక్షణ అందించగా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాదేవి, చిన్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎలిజబెత్, వైద్య నిపుణులు పాల్గొన్నారు.