Share News

కోడ్‌ లేదా సారూ!

ABN , Publish Date - Mar 28 , 2024 | 02:11 AM

మండలంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ఎన్నికల అధికారుల పర్యవేక్షణ కరువవడంతో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ రంగులతో ట్యాంకర్లు, జెండాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.

కోడ్‌ లేదా సారూ!
మల్లాపాలెంలో వైసీపీ రంగులతో ట్యాంకరుతో తోలుతున్న నీరు

వైసీపీ రంగుల ట్యాంకర్‌తో నీటి సరఫరా

మల్లాపాలెం వైపు చూడని ఎన్నికల అధికారులు

పుల్లలచెరువు, మార్చి 27: మండలంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గ్రామాల్లో ఎన్నికల అధికారుల పర్యవేక్షణ కరువవడంతో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ రంగులతో ట్యాంకర్లు, జెండాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. మండలంలోని మల్లాపాలెంలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన జరుగుతోంది. గ్రామంలో అధికార పార్టీ నియోజవర్గ నాయకుడి ఆధ్వర్యంలో ట్యాంకర్‌కు వైసీపీ రంగులు పూసి ఇంటింటికీ నీటి సరాఫరా చేస్తున్నారు. అయినప్పటికీ, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలుచేయని అధికారులపై జిల్లా ఎన్నికల అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Mar 28 , 2024 | 02:11 AM