Share News

ఒంగోలులో పేకాట శిబిరంపై దాడి

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:13 AM

ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు ఏర్పాటుపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా మరో ఆరు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టులు ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. తదనుగుణంగా ఆ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావించింది.

ఒంగోలులో పేకాట శిబిరంపై దాడి

ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి

జనార్దన్‌రెడ్డి వెల్లడి

ఒంగోలు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టు ఏర్పాటుపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవాటికి అదనంగా మరో ఆరు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టులు ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. తదనుగుణంగా ఆ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో కుప్పం, శ్రీకాకుళం, తుని, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నాగార్జునసాగర్‌లు ఉన్నాయి. వాటిలో భూమి ఎక్కడెక్కడ అందుబాటులో ఎంతెంత ఉందో తొలుత తెలపాలని కేంద్రం కోరగా ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. అందులో ఒంగోలులో 657 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఆయా ప్రాంతాలలో ఎయిర్‌ పోర్టుల ఏర్పాటుకు తొమ్మిది అంశాలపై ప్రాథమిక అధ్యయానికి కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు అఽధారిటీ చేయనుంది. అందుకోసం ఒక్కొక్క ఎయిర్‌పోర్టు కోసం రూ.37లక్షలు అవసరం కాగా మొత్తం ఆరు ఎయిర్‌పోర్టులకు కలిపి రూ.2.27కోట్లను విడుదల చేస్తున్నట్లు మంత్రి జనార్దన్‌రెడ్డి మంగళవారం రాత్రి అమరావతిలో ప్రకటించారు. అందులో ఒంగోలు కూడా ఉండగా ప్రాథమిక అధ్యయన రిపోర్టులు ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

వెలిగొండకు నిధులపై సీఎంకు కృతజ్ఞతలు

వెలిగొండ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్‌లో సుమారు రూ.400 కోట్లు కేటాయింపు పట్ల ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామిల నేతృత్వంలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యేలు జనార్దన్‌, నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, ఏలూరి సాంబశివరావు, ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం, టూరిజం బోర్డు చైర్మన్‌ నూకసాని బాలాజీ, వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు తదితరులు సీఎం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 12:14 AM