Share News

ఓవరాల్‌ చాంపియన్‌ ‘ప్రకాశం’

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:24 PM

సింగరాయకొండ మండలంలోని పాకల జడ్పీ హైస్కూల్‌లో హోరాహోరీ జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14, 17, 19 బాలబాలికల రాష్ట్రస్థాయి క్యారమ్స్‌ పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఓవరాల్‌ చాంపిన్‌షి్‌పను సాధించారు.

ఓవరాల్‌ చాంపియన్‌ ‘ప్రకాశం’

రాష్ట్రస్థాయి క్యారమ్స్‌ పోటీల్లో జిల్లా విద్యార్థుల సత్తా

సింగరాయకొండ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : సింగరాయకొండ మండలంలోని పాకల జడ్పీ హైస్కూల్‌లో హోరాహోరీ జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14, 17, 19 బాలబాలికల రాష్ట్రస్థాయి క్యారమ్స్‌ పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఓవరాల్‌ చాంపిన్‌షి్‌పను సాధించారు. అండర్‌-14 బాలుర విభాగంలో వి.జీవన్‌కుమార్‌ (ప్రకాశం), జి.రాజేష్‌ (ప్రకాశం), జె.నిషాల్‌ (విశాఖ), పి.నరసింహ (కడప), బాలికల విభాగంలో కె.సోని (ప్రకాశం), ఎస్‌.హేమశ్రీ (గుంటూరు), బి.వెంకటేశ్వరమ్మ (ప్రకాశం), ఐ.మృధు (విశాఖ) ప్రఽథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో నిలిచారు. అండర్‌-17 విభాగంలో కె.చందు (ప్రకాశం), కె.సిద్ధు (ప్రకాశం), కె.వెంకటసాయికుమార్‌ (ప్రకాశం), సిహెచ్‌.స్టీఫెన్‌పాల్‌ (గుంటూరు), బాలికల విభాగంలో టి.గంగోత్రి (ప్రకాశం), ఎస్కే మెబీరా (ప్రకాశం), ఎస్కే. గఫ్రీనా (నెల్లూరు), కె.అగన్య (ప్రకాశం) వరుస స్థానాలను కైవసం చేసుకున్నారు. అండర్‌-19 విభాగంలో ఎస్‌.కె.మస్తాన్‌ (ప్రకాశం), పి.పవన్‌కుమార్‌ (ప్రకాశం). టి.అశోక్‌ (ప్రకాశం), బి.యోను (గుంటూరు) బాలికల విభాగంలో ఎస్‌.ప్రియదర్శిని, (విశా ఖ), కె.హరిత (నెల్లూరు), జె.ధారిక (విశాఖ), ఇ.మహి (నెల్లూరు) ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలను సాధించారు. మూడు విభాగాల్లో జిల్లాకు చెందిన 13 మంది విద్యార్థులు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచి ఓవరాల్‌ చాంపియన్‌లుగా నిలిచారు. విజేతలైన విద్యార్థులకు హెచ్‌ఎం డీవీఎస్‌ ప్రసాద్‌, జిల్లా ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ ఎండీ హజీరా బేగం, వ్యాయామ ఉపాధ్యాయులు మెడల్స్‌ను అందజేశారు.

Updated Date - Dec 23 , 2024 | 11:24 PM