Share News

అధ్వానంగా పంచాయతీరాజ్‌ రహదారులు

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:36 AM

పుల్లలచెరువు మండలంలోని పలు పంచాతీయరాజ్‌ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి.

అధ్వానంగా పంచాయతీరాజ్‌ రహదారులు

పుల్లలచెరువు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పుల్లలచెరువు మండలంలోని పలు పంచాతీయరాజ్‌ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో వర్షం కురిసినప్పుడు రోడ్లు బురద మాగాణిని తలపిస్తోంది. ప్రఽధానంగా మండలంలోని రంగనపాలెం-కుందంపల్లి,చాపలమడుగు-సి.కొత్తపల్లి, మానేపల్లి-అయ్యాగానిపల్లి, మానేపల్లి రోడ్డు, రెంటపల్లి పంచాయతీరాజ్‌ రోడ్డుల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది.

మండలంలోని కుందంపల్లి పంచాయతీ రాజ్‌ రోడ్డుకు గత టీడీపీ ప్రభుత్వం 1.5 కీలోమీటర్ల మేర బీటీ రోడ్డును మంజూరు చేసింది. అయితే వెంటనే 2019లో ఎన్నికల కోడ్‌ వచ్చింది. దీంతో ఎక్కడి పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి మంత్రి సురేష్‌ 2020లో రోడ్డు పనులకు శంకుస్ధాపన చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ రోడ్డుకు మట్టిపోసిన పాపన పోలేదు. దీంతో కుందంపల్లి గ్రామస్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో రహదారి అభివృద్ధిపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు, కొత్తరోడ్ల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తుండడంతో ఈ రహదారిని పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. తక్షణమే శాశ్వత రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 10 , 2024 | 01:36 AM