Share News

దర్శికి చేరిన ప్యాసింజర్‌ రైలు

ABN , Publish Date - Jul 03 , 2024 | 11:14 PM

ట్రయిల్‌రన్‌లో భాగంగా ప్యాసింజర్‌ రైలు బుధవారం దర్శికి చేరుకుంది. రైల్వేలైను పరిశీలించేందుకు సిబ్బంది కూడా అందులోనే వచ్చారు. నడికుడి నుంచి దర్శి వరకు ప్యాసింజర్‌ రైళ్లను నడపాలని అధికారులు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.

దర్శికి చేరిన ప్యాసింజర్‌ రైలు
దర్శికి చేరిన ప్యాసింజర్‌ రైలు

దర్శి, జూలై 3 : ట్రయిల్‌రన్‌లో భాగంగా ప్యాసింజర్‌ రైలు బుధవారం దర్శికి చేరుకుంది. రైల్వేలైను పరిశీలించేందుకు సిబ్బంది కూడా అందులోనే వచ్చారు. నడికుడి నుంచి దర్శి వరకు ప్యాసింజర్‌ రైళ్లను నడపాలని అధికారులు ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. పనులు పూర్తికాక జాప్యం జరుగుతున్న విషయాన్ని ఆంధ్రజ్యోతిలో ‘సా..గుతున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను పనులు’ శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. గత ఏప్రిల్‌ నుంచి ప్యాసింజర్‌ రైళ్లు నడుపుతామని గతంలో అధికారులు ప్రకటించిన తీరును కథనంలో వివరించటంతో అధికారులు స్పందించారు. వీలైనంత త్వరలో రైళ్లు నడపాలనే ఉద్దేశంతో ట్రయిల్‌రన్‌లో భాగంగా బుధవారం మరోసారి సిబ్బందితో ప్యాసింజర్‌ రైలు వచ్చింది. ప్రస్తుతం దర్శి వరకు ఒక లైను మాత్రమే పూర్తయినందున ప్యాసింజర్‌ రైళ్లు తిరిగే అవకాశం ఉంది. దర్శి నుంచి శ్రీకాళహస్తి వరకు రైల్వేలైను నిర్మాణం మందకొడిగా సాగుతోంది. దర్శి-పొదిలి మధ్యలో నిర్మాణం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ ఒక రైతు నష్టపరిహారం విషయంలో ఎక్కువ చెల్లించాలని కోర్టుకు వెళ్లటంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. గత వైసీపీ ప్రభుత్వం తమ వాట చెల్లించకపోవటం వలన కూడా ఐదేళ్లు పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ప్రస్తుతం అధికారులు హడావుడి చేస్తున్నారు. ఇప్పటికైనా వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి రైళ్లు నడపాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 11:14 PM