పింఛన్ సొమ్మును వినియోగించుకోవాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 10:28 PM
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ సొమ్మును సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎం కొండ య్య సూచించారు. మండల పరిఽధిలోని ఆమోదగిరిపట్నంలో మంగళవారం పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి పెన్షన్ సొమ్మును అం దజేశారు.
ఎమ్మెల్యే కొండయ్య
వేటపాలెం(చీరాల), డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ సొమ్మును సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎం కొండ య్య సూచించారు. మండల పరిఽధిలోని ఆమోదగిరిపట్నంలో మంగళవారం పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి పెన్షన్ సొమ్మును అం దజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ సీఎం చంద్రబాబు చెప్పిన ప్రతి ఒక్క మాటనూ అములు చేస్తున్నారన్నా రు. ఈ సందర్భంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
అద్దంకిలో 96శాతం
అద్దంకి : అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో మంగళవా రం 96 శాతం పింఛన్‌ల పంపిణీ జరిగింది. వైస్ చైర్మన్ దేసు పద్మేష్, కౌన్సిలర్‌లు అత్తులూరి రమే్‌షబాబు, కంపా రజని, మాగులూరి తిరుపతమ్మ, కొమ్మాలపాటి సుధీర్, గుంటూరు విజయలక్ష్మి మాధవరావు, ఏజెండ్ల నాగరాజు తదితరులు తమ పరిధిలో ఫింఛన్ ల పంపిణీ పర్యవేక్షించారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 3865 మందికి పింఛన్‌లను పంపి ణీ చేయాల్సి ఉండగా మంగళవారం 3720 మందికి పంపిణీ చేసినట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు.
మండలంలో 94.2 శాతం
పంగులూరు : మండలంలో మంగళవారం 94.2 శాతం పింఛన్‌లను పంపిణీ చేశారు. మొత్తం 7836 మందికి 3 కోట్ల 22 లక్షల 75 వేల 500 రూపాయలను పంపిణీ చేయాల్సి ఉండగా 7.383 మందికి 3 కోట్ల 2 లక్షల 19 వేల 500 రూపాయల పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మండలంలో నవంబరులో భర్తను కోల్పోయిన మహిళలకు 112 వితంతు పింఛన్‌లు మంజూరైనట్లు ఎంపీడీవో స్వరూపారాణి తెలిపారు.
చినగంజాం : మండల పరిధిలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎంపీడీవో ఏ.శ్రీనివాసమూర్తి పరిశీలించారు. చినగంజాం, కడవకుదురు, మున్నంవారిపాలెం, కొత్తపాలెం, రాజుబంగారుపాలెం, సోపిరాల తదితర గ్రామాల్లో జరుగుతున్న పెన్షన్ పంపిణీని ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. మండల పరిధిలో 5885 మంది పెన్షన్‌దారులకు గాను 5630 మందికి పెన్షన్ పంపిణీ చేసి 96శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఽబుధ, గురువారాల్లో అందజేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.