Share News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీఐ

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:12 AM

మండలంలో ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ దాందాలు వడ్డీ వ్యాపారుల ఆగడాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకటేష్‌ సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీఐ

పొదిలి, అక్టోబరు 22 : మండలంలో ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ దాందాలు వడ్డీ వ్యాపారుల ఆగడాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకటేష్‌ సూచించారు. మంగళవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 5వ తేదీన ఓంకార్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై దాడి జరిగిందని, ఆ దాడిలో ఓంకార్‌ అనే వ్యక్తికి 90 కుట్ల పడ్డాయన్నారు. పొల్లా రమేష్‌, ఓంకార్‌ల మధ్య భూములు, స్థలాల కొనుగోళ్ల మధ్య వివాదాలే దీనికి కారణమన్నారు ఓంకార్‌ను కిరాయి హంతకులతో హతమార్చేందకు పొల్లా రమేష్‌ పథకం పన్నార్నారు. రమేష్‌ అనేవ్యక్తి భూవివాదాల్లో ఆరితేరిన వ్యక్తని పొలం లేదా స్థలం కొనిపెడతానని డబ్బుల తీసుకోవడం పదిరోజులు తనతో తిప్పుకోవడం ఆ తరువాత ఏదో విధంగా భయానికి గురిచేయడం తీసుకున్న డబ్బులు ఎగ్గోట్టడం లాంటి దందాలు చేస్తుంటాడన్నారు. అంతేకాకుండా డబ్బులు తీసుకున్న వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగితే పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అసైన్డ్‌ భూములు, డబుల్‌ రిజిస్ట్రేషన్‌లు లాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. ఓంకార్‌ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న పొల్లా రమేష్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. ఎవరికైనా రమేష్‌ ఆచూకి తెలిస్తే వెంటనే సమాచారం అంధించాలని తెలిపిన వారి పేర్లు గోప్యంగా ఉంచడంతోపాటు తగిన రివార్డు అందజేస్తామన్నారు. భూముల క్రయ విక్రయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఐ వేమన ఉన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:12 AM