Share News

అనుమతి కొంత .. అదనపు నిర్మాణం మరికొంత

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:34 PM

ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధంగా చర్యలు చే పట్టటం హర్షనీయం. అయితే సదరు చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో ఆర్టీసీ ఇచ్చిన అనుమతికి మించి చేపడుతున్న నిర్మాణంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ ప్రాంగణంలో 23 సెంట్ల ఖాళీ స్థలంలో జీ ప్లస్‌ వన్‌ నిర్మాణం చేపట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు టెం డరు ద్వారా లీజుదారుకు అనుమతి ఇచ్చారు.

అనుమతి కొంత .. అదనపు నిర్మాణం మరికొంత
చీరాల ఆర్టీసీ ప్రాంగణంలో అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణం

చీరాల ఆర్టీసీ డిపో ప్రాంగణంలో కట్టడంపై సర్వత్రా విమర్శలు

జీ ప్లస్‌ వన్‌కు కేటాయించే స్థలంలో జీ ప్లస్‌ టూ పనులు

తొలగించాలని డీఎం నోటీసులు

ఒడా నుంచి మంజూరు కాని అనుమతులు

చీరాల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధంగా చర్యలు చే పట్టటం హర్షనీయం. అయితే సదరు చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో ఆర్టీసీ ఇచ్చిన అనుమతికి మించి చేపడుతున్న నిర్మాణంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ ప్రాంగణంలో 23 సెంట్ల ఖాళీ స్థలంలో జీ ప్లస్‌ వన్‌ నిర్మాణం చేపట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు టెం డరు ద్వారా లీజుదారుకు అనుమతి ఇచ్చారు. నెలకు రూ.1,80,000 అద్దె, అందుకుగా ను రూ.30,000 జీఎస్టీతో కలిపి నెలకు రూ.2,10,000 చెల్లించేలా అనుమతులు ఇ చ్చారు. లీజు కాలపరిమితి 15 సంవత్సరాలు. అయితే సదరు లీజుదారుడు అద్దె ప్రాతిపదికలోని నిబంధనల మేరకు జీ ప్లస్‌ వన్‌ మా త్రమే నిర్మాణాలు చేపట్టాలి. అయితే జీ ప్లస్‌ టూకు కూడా ఇనుప ట్రస్‌లతో నిర్మాణ ప నులు చేశారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఆ నిర్మాణ పనులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీల ప్రస్థావవ వస్తోంది. రాజకీయ కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి. వాటిమాట ఎలా ఉన్నా అద్దె ప్రాతిపదికన ఇచ్చే క్రమంలో ఆర్టీసీ ఏ నిబంధనలు ఉన్నవో వాటిని అమలు పరిస్తే ఎలాంటి స మస్యలుండవు. లేదంటే ఒక వైపు ఆర్టీసీ ఆదాయానికి గండి పడే ప్రమాదం ఉండడంతో పాటు భవిష్యత్‌లో మరికొన్ని సమస్య లు ఎదురయ్యే ప్రమాదం ఉందని విషయం తెలిసినవారు అంటున్నారు.

అదనపు నిర్మాణాలను తొలగించాలని నోటీసులిచ్చాం

ఆర్టీసీ ప్రాంగణంలో 23 సెంట్ల స్థ లంలో నిర్మాణాలకు, వ్యాపార నిర్వహణకు అద్దె ప్రాతిపదికన ఇచ్చాం. జీ ప్లస్‌ వన్‌కు మాత్రమే అనుమతిచ్చాం. లీజుదారుడు జీ ప్లస్‌ టూకి ఇనుప కమ్మెలతో నిర్మాణ ప్రక్రి య చేపట్టారు. అవి తొలగించాలని నోటీ సు ఇచ్చాం. నిబంధనల మేరకు అద్దె నెల కు రూ.1,80,000, అందుకుగాను రూ.30 వేలు జీఎస్టీ, మొత్తం నెలకు రూ.2,10,000 చెల్లించాలి. 15ఏళ్ల కాలపరమితి. సుమారు ఆరు నెలల క్రితం అగ్రిమెంట్‌ జరిగింది. అదనపు నిర్మాణాలను అనుమతించం.

- శ్యామల, మేనేజర్‌,

ఆర్టీసీ చీరాల డిపో

నిబంధనల మేరకు మాత్రమే నిర్మాణం చేపట్టాలి

ఆర్టీసీ ప్రాంగణంలో లీజుకు తీసుకున్న ప్రదేశంలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించాం. నిబంధనల మేరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని చెప్పాం. అతిక్రమిస్తే ఉన్న నిబంధనల మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

- శ్రీనివాసరావు, టీపీవో, చీరాల మున్సిపాలిటీ

సపోర్ట్‌ డాక్యుమెంట్స్‌ అడిగాం .. వాటిని దఖలు చేయాల్సి ఉంది

ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో చేపడుతున్న నిర్మాణానికి సంబంధించి అనుమతుల కోసం దఖలు చేసిన పత్రాలు పూర్తి స్థాయిలో సరిపోలేదు. పూర్తి సమాచారం కోసం సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి పంపాలని చెప్పాం. లేదంటే అసలు నిర్మాణం, అదనపు నిర్మాణానికి సంబంధించి నిబంధనల మేరకు చర్యలు ఉంటాయి.

- బాబూరావు, ఒడా ప్లానింగ్‌ ఆఫీసర్‌, ఒంగోలు

Updated Date - Dec 22 , 2024 | 11:34 PM