Share News

విద్యార్థుల జీవితాలతో ఆటలా

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:41 PM

విద్యార్థుల జీవితాలంటే ఆటలా ? మీ పిల్లలయితే ఇలాగే వ్యవహరిస్తారా ? తీరు మార్చకోకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు పద్మావతి హెచ్చరించారు. మంగళవారం జాతీయ రహదారి సమీపంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువు తీరిన రాగి పిండి స్కూల్‌ విద్యార్థులకు ఆహారంగా ఇవ్వడంతో పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు గుర్తించారు.

విద్యార్థుల జీవితాలతో ఆటలా
కేజీబీవీలో తనిఖీ చేస్తున్న బాలల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు పద్మావతి

చీరాలలో పలు స్కూళ్లు తనిఖీ చేసిన బాలల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు పద్మావతి

ఏపీ మోడల్‌, కేజీబీవీ, పేరాల హైస్కూల్‌ సిబ్బంది తీరుపై ఆగ్రహం

చిన్నారుల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా 8 తీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

మూడు స్కూళ్లకు షోకాజ్‌ నోటీసులు

చీరాలటౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల జీవితాలంటే ఆటలా ? మీ పిల్లలయితే ఇలాగే వ్యవహరిస్తారా ? తీరు మార్చకోకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు పద్మావతి హెచ్చరించారు. మంగళవారం జాతీయ రహదారి సమీపంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువు తీరిన రాగి పిండి స్కూల్‌ విద్యార్థులకు ఆహారంగా ఇవ్వడంతో పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు గుర్తించారు. విద్యార్థుల గదిలో విద్యుత్‌ మోటారు ఉండడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయస్థితికి చేరితే బాద్యులెవరని నిలదీశారు. అనంతరం సమీపంలోని కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. లైట్‌లు లేకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతోపాటు ప్రిన్సిపాల్‌ తీరుపై పద్మావతి మండి పడ్డారు. బి య్యం నాణ్యత ప్రమాణం కోల్పోయి ఉన్నట్లు గుర్తించి ఆరా తీశారు. ప్రిన్సిపాల్‌ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుసుకున్నారు. పేరాల హైస్కూల్‌ తనిఖీ చేసి అసంతృప్తి చెందారు. ఏపీ మోడల్‌, కేజీబీవీ, పేరాల స్కూల్‌ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని పద్మావతి ఎంఈవో సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 15 రోజులలో సమస్యలు పరిష్కారం కావాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గోపీకృష్ణ, మునిసిపల్‌ కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌, ఎంపీడీవో శివసుబ్రహ్మణ్యం. ఎస్‌ఐ నాగశ్రీను, నీలిమ, చారులత, పురుషోత్తమరావు, ప్రవీన, కృష్ణ, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:41 PM