Share News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:18 AM

ప్రజాసమస్యల పరిష్కార వేదికగా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తునట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్‌

ఎర్రగొండపాలెం రూరల్‌ నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కార వేదికగా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తునట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. సోమవారం మండల పరిషత్‌ కార్యా లయ అవరణలోని డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆడిటో రియంలో ఎంపీడీవో బి.శ్రీనివాసులు ఆధ్యక్షతన ప్రజదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎరిక్షన్‌బాబు హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని వారి సమస్యలను పరిష్కరిం చేందుకే ఎన్నడూ లేనివిధంగా ప్రజదర్బార్‌ వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడ వచ్చే సమస్యలను నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్నారు. గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా స్థాయి సమస్యలు కూడా పరిష్కరించేందుకు తాను ఎప్పుడు ముందుంటానని అన్నారు. నియోజవర్గంలో ఎక్కువగా భూ సమస్యలు, నీటి సమస్య, రోడ్ల సమస్యలు ఉన్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే రూ.15 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అలాగే 135 మందికి రాయితీపై గోకుళం షెడ్డులు మంజూరయ్యాయన్నారు. త్వరలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాయితీల ద్వారా పథకాలు వస్తాయని అన్నారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు అధికారు లతో కలసి వెలిగొండ ప్రాజెక్టు పరిశీలించి అక్కడ జరుగుతున్న పనుల నివేదికను రాష్ట్ర ముఖమంత్రి చంద్రబాబు దృష్టికి మంత్రులు తీసుకెళ్లినట్లు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌లో వెలుగొండ ప్రాజెక్టు నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, కాశికుంట తాండ సర్పంచ్‌ ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌, మాజీ సర్పంచ్‌ కంచర్ల సత్యనారాయణగౌడ్‌, పట్టణ అధ్యక్షుడు షేక్‌.మస్తాన్‌, డీటీ మల్లికార్జుననాయుడు వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్భార్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ప్రజలు 201 అర్జీలు వచ్చినట్లు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - Nov 12 , 2024 | 12:18 AM