నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:39 AM
గిరిజనుల సమగ్రాభివృద్ధే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా ల లక్ష్యం అని మార్కాపురం సబ్ కలెక్టర్ సహ దిత్ వెంకట త్రివినాగ్ అన్నారు.
పెద్దదోర్నాల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమగ్రాభివృద్ధే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా ల లక్ష్యం అని మార్కాపురం సబ్ కలెక్టర్ సహ దిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. స్థానిక ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలలోజన్ జాతీయ గౌరవదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో భాగంగా దోర్నాల, పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, అర్ధవీడు, పెద్దారవీడు, గిద్దలూరు మండలాలకు చెందిన అన్నిశాఖల అధికారులు, చెంచు గిరిజనులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రదర్శించారు. అనంతరం సబ్‌కలెక్టర్ త్రివినాగ్ మాట్లాడుతూ వెనుకబాటుతనంతో ఇబ్బం దులు పడుతున్న గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గిరిజనుల జీవనోపాధులు పెంపొందించేందుకు 11 రకా ల అంశాలను సర్వే చేశారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి చర్యలు కూడా చేపట్టారన్నా రు. ఇంటి నిర్మాణాలకు ఆర్‌డీటీ సంస్థ ప్రభుత్వం సమన్వయంతో కసరత్తు చేస్తోందన్నారు. గిరిజన నాయకుడు స్వాతంత్య్ర సమరయోధుడు దర్తీ ఆలా భగవాన్ బిర్షా ముండా 150వ జయంతిని పురష్కరించుకుని కేంద్రప్రభుత్వం జన్‌జాతీయ దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా ఏకలవ్య విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గిరిజనులకు ఇంటి పట్టాలు పంపిణీచేశారు. కార్యక్రమంలో ఏపీవో సురేష్‌కుమార్, డీటీ డబ్ల్యూవో జగన్నాథరావు, బీఎస్‌ఎన్‌ఎల్ డీఈ రవికుమార్, హౌసింగ్ ఈఈ పవన్‌కుమార్, డీఈవో కిరణ్ కుమార్, డీఎంహెచ్‌వో శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ ఈశ్వర్ భరద్వాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ భ్రమరాంబికా దేవి, ఆర్‌డీటీ ఆర్‌డీ నాగరాజు, ఆర్‌వోఎఫ్‌ఆర్ కో ఆర్డినేటర్ మంతన్న, ఏడు మండలాలకు చెందిన తహసీ ల్దార్లు, ఎంపీడీవోలు,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కుమ్మరి కాలనీ సమస్యలు పరిష్కరించాలి
పెద్ద దోర్నాల : దోర్నాలలోని కుమ్మరి కాలనీ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ స్థానిక ఆధికారులను ఆదేశించారు. ఏకలవ్యలో జన్ జాతీయ గౌరవ దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో కాలనీవాసులు ఖాళీ బిందెలతో అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని, మురికి నీరు ప్రవహించక దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో స్పందించిన సబ్ కలెక్టర్ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ భ్రమరాంబికాదేవి, పంచాయతీ కార్యదర్శి శివకోటేశ్వరరావుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.