Share News

శిథిలావస్థలో రక్షిత నీటి పథకాలు

ABN , Publish Date - May 27 , 2024 | 10:58 PM

అద్దంకి పట్టణంలో నా లుగు ద శాబ్దాల క్రితం తొలిసారి నిర్మించిన రక్షిత మంచినీటి పథకం ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరి ఏ క్షణమైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. అద్దంకి పం చాయతీగా ఉన్న సమయంలో మొట్ట మొదటి రక్షిత మంచినీటి పథకం పనులను 1981 సంవత్సరం లో ప్రారంభించి 1986 సంవత్సరానికి పూర్తి చేసి అప్పటి సర్పంచ్‌ బొడ్డపాటి పెద హనుమ య్య ప్రారంభించారు.

శిథిలావస్థలో రక్షిత నీటి పథకాలు
అద్దంకి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో శిథిలావస్థకు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌

కూలేందుకు సిద్ధంగా ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌

నాలుగదు దశాబ్దాల కిందట నిర్మాణం

నీటిని ట్యాంక్‌కు పంపింగ్‌ చేయకుండా నేరుగా విడుదల

అద్దంకి, మే 27 : అద్దంకి పట్టణంలో నా లుగు ద శాబ్దాల క్రితం తొలిసారి నిర్మించిన రక్షిత మంచినీటి పథకం ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరి ఏ క్షణమైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. అద్దంకి పం చాయతీగా ఉన్న సమయంలో మొట్ట మొదటి రక్షిత మంచినీటి పథకం పనులను 1981 సంవత్సరం లో ప్రారంభించి 1986 సంవత్సరానికి పూర్తి చేసి అప్పటి సర్పంచ్‌ బొడ్డపాటి పెద హనుమ య్య ప్రారంభించారు. అప్పటి శిలాఫలకం ఇప్పటికి కూడా ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ వద్ద ఉన్న ప్రహరీ గోడపై ఉంది. అనంతరం అద్దంకి పట్టణంలో జనాభా అనూహ్యంగా పెరగడంతో కాకానిపాలెం, రామ్‌నగర్‌లలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు నిర్మించి నీటి సరపరా చేస్తున్నారు. గత టీడీపీ ప్ర భుత్వ హయంలో రాబోయే 5 దశాబ్దాల భవిష్యత్‌ అవసరాలను దృష్టి లో ఉంచుకొని సుమారు రూ.85కోట్లలతో సమగ్ర మంచినీటి పధకం పనులు ప్రారంభించా రు. 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో సమగ్ర మంచినీటి పథకం పనులు పూర్తి కా లేదు. ప్రస్తుతం నాలుగు దశాబ్దాల నాటి మం చినీటి పధకం పూర్తి గా శిధిలావస్థ కు చేరటం తో ఏసమయంలోనైనా కూలే ప్రమాదం ఉంది. ఈ నేపఽథ్యంలోనే మున్సిపల్‌ అధికారులు గత కొంత కాలంగా మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌కు నీటి పంపింగ్‌ నిలిపి వేసి పంప్‌ హౌస్‌ల నుంచి వచ్చే నీటిని నేరుగా ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో కొన్ని శివారు ప్రాంతాలకు సరిగ్గా నీటి సరఫరా కాకపోగా, అతి తక్కువ సమయం మాత్రమే నీటి విడుదల జరుగుతుందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. ఏ సమయంలోనైనా ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ కూలే అవకాశం ఉండటంతో స్థానిక గృహాల ప్రజలతో పాటు మున్సిపల్‌ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ అనుకోకుండా కూలితే పెను ప్రమాదమే జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ సమీపంలో పలు గృహాలతో పాటు మూడు వైపులా రోడ్లు, మరో వైపు మున్సిపల్‌ కార్యాలయం ఉంది. ఇప్పటికైనా అధికారులు ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఓవ ర్‌ హె డ్‌ ట్యాంక్‌ ను కూల్చి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 27 , 2024 | 10:58 PM