Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:27 AM

చిన్నారులందరికీ పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుమయ కోరారు.

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

గిద్దలూరు, మార్చి 2 : చిన్నారులందరికీ పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుమయ కోరారు. ఈ నెల 3న ఆదివారం జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుమయ మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆది వారం మండలంలోని 85 కేంద్రాలలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 8 మొబైల్‌ టీమ్‌లు ఏర్పాటు చేసి రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఇతర ప్రధాన కూడళ్లలో పోలియో చుక్కలు వేస్తామని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించుకుని పోలియో మహమ్మారి రాకుండా తరిమికొట్టాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో వైద్యాధి కారులు డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ మహబూబ్‌షరీఫ్‌, డాక్టర్‌ భార్గవ రంగారెడ్డి, హెల్త్‌సూపర్‌ వైజర్‌ సుధ, హెల్త్‌ అసిస్టెంట్లు పాల్గొ న్నారు.

తర్లుపాడు : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రధానోపాధ్యాయులు షేక్‌ మౌలాలి అన్నారు. కలుజువ్వలపాడు పంచా యతీలోని లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పోలియో చుక్కలు తప్పని సరిగా వేయించుకోవాలని నినాదాలు చేస్తూ, ర్యా లీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మౌలాలి మాట్లాడుతూ పోలియో రహిత సమా జాన్ని నిర్మించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు షేక్‌ షెక్షావలి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:27 AM