Share News

ఆర్జీవీకి హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:38 AM

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. మద్దిపాడు పోలీసు స్టేషన్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రామ్‌గోపాల్‌వర్మపై కేసులు నమోదైన విషయం విదితమే.

ఆర్జీవీకి హైకోర్టులో ఊరట

9 వరకు అరెస్టు చేయవద్దని ఆదేశం

ఒంగోలు కైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. మద్దిపాడు పోలీసు స్టేషన్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రామ్‌గోపాల్‌వర్మపై కేసులు నమోదైన విషయం విదితమే. సోషల్‌ మీడియాలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై ఆర్జీవీ అసభ్యకరంగా పెట్టిన పోస్టులతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు ఫిర్యాదులు చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే అరెస్టు నుంచి మినహాయింపు కోరుతూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 9కి వాయిదా వేసిన న్యాయమూర్తి అప్పటివరకు రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించారు.

Updated Date - Dec 03 , 2024 | 01:38 AM