ప్రజా ఇబ్బందుల దృష్ట్యా ఆక్రమణలు తొలగింపు
ABN , Publish Date - Nov 13 , 2024 | 10:50 PM
ప్రజా ఇబ్బందుల దృష్ట్యా ఆక్రమణలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జోస్‌ఫడానియేల్ చెప్పారు. కనిగిరిలో బుధవారం చేపట్టిన రోడ్డు ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.
కనిగిరి మున్సిపల్ కమిషనర్ జోసఫ్ దానియేలు
కనిగిరి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ఇబ్బందుల దృష్ట్యా ఆక్రమణలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జోస్‌ఫడానియేల్ చెప్పారు. కనిగిరిలో బుధవారం చేపట్టిన రోడ్డు ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. కనిగిరి.. డివిజన్ కేంద్రంగా మారినప్పటికీ పంచాయ తీ స్థాయిలో మాత్రమే ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటిలోని ప్రధాన రోడ్లలోని ఆక్రమణలను తొలగించేందుకు గత ప్రభుత్వంలోనే ప్రణాళిక సిద్ధమైందన్నారు. దాని కార్యాచరణను కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు వెంట ఉన్న షాపుల నిర్వాహకులకు ముందుగానే తొలగింపు విష యం తెలియచేసి వారే స్వయంగా తొలగించుకునేలా సమయం ఇచ్చామన్నారు. నిర్ణీత గడువులోగా షాపుల యజమానులు తొలగించలేకపోయారని చెప్పారు. దీంతో మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు చేపట్టామన్నారు. చర్చి సెంటరులోని నలు రోడ్లులోని ఆక్రమణలను గతంలో తొలగించగా, ఫుట్‌పాత్ కింద ఉన్న భారీ డ్రైనేజీ కాలువల పూడికతీత పనులు చేపట్టామని చెప్పారు. అదేవిధంగా చెప్పులబజారులోని చర్చి గోడవెంట ఉన్న ఆక్రమణలు కూడా గతంలో తొలగించగా, ప్రస్తుతం రెండోవైపు ఆక్రమణలను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా నగరికంటి బసవయ్యసెంటరు నుంచి బొడ్డుచావిడి వరకు ఇంటి యజమానులకు, షాపుల నిర్వాహకులకు తొలగించకునే అవకాశం ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుందన్నారు. వారు వీలైనంత త్వరగా నిర్ణయానికి రావాలని చెప్పారు. బొడ్డుచావిడి నుంచి దొరువు బజారు కూడా ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.