నగరంలో రోడ్‌సైడ్ ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:51 AM
నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేం దుకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఈ మేరకు కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం స్థానిక ఊరచెరువులోని దామోదర సంజీవయ్య కూరగా యల మార్కెట్ ఎదురు రోడ్‌సైడ్ నిర్మాణాలను తొ లగించారు.
పరిశీలించిన కమిషనర్
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 12 (ఆంధ్రజ్యో తి): నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేం దుకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఈ మేరకు కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం స్థానిక ఊరచెరువులోని దామోదర సంజీవయ్య కూరగా యల మార్కెట్ ఎదురు రోడ్‌సైడ్ నిర్మాణాలను తొ లగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ కేవలం తోపుడుబండ్లు మాత్రమే ఉండాలని, ఎలాంటి కట్టడాలు గానీ తాత్కాలిక నిర్మాణాలు, షెడ్డులు వేయకూడదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి పలు తాత్కాలిక షెడ్‌లను కార్పొరేషన్ అధికారులు తొల గించారు. ఇక మార్కెట్ లోపల రోడ్డుపై ఆక్రమణ లు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. నగరంలో ని ప్రధాన రహదారుల వెంట ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య రా కుండా తోపుడు బండ్లుతో వ్యాపారాలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఇచ్చిన కొద్ది స్థలాన్ని శాశ్వతంగా ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉం టాయన్నారు. నగరంలోని అన్ని రోడ్ల వెంట ఆక్రమ ణలు తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్య క్రమంలో హెల్త్ ఆఫీసర్ మనోహర్‌రెడ్డి, టీపీవో ప్ర సాద్, శానిటరి ఇన్‌స్పెక్టర్ షేక్ బాబ్జి, ఆర్వో విజయ్ భాస్కర్, ఆర్‌ఐ కళ్యాణి, సిబ్బంది పాల్గొన్నారు.