Share News

మేజర్‌ కాలువలలో పూడిక, చిల్లచెట్ల తొలగింపు

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:12 AM

సాగర్‌ కాలువలలో పూడిక పేరుకు పోవడం, చిట్ల చెట్లు దట్టంగా పెరగడంతో నీటి ప్రవాహం ముందుకు కదలక పొలాలకు నీరు సరిగా చేరడం లేదు. దీంతో పలు గ్రామాల రైతులు ఇటీవల అద్దంకి బ్రాంచి కాలువపై మంత్రి రవికుమార్‌ పర్యటించే సమయంలో వివరించారు. దీంతో వెంటనే స్పందించిన రవికుమార్‌ అద్దంకి నియోజకవర్గ పరిధిలోని అన్ని మేజర్‌ కాలువలలో వెంటనే పూడికతీత పనులు, చిల్లచెట్ల తొలగింపు చేపట్టాలని ఎన్నెస్పీ అధికారులను ఆదేశించారు.

మేజర్‌ కాలువలలో పూడిక, చిల్లచెట్ల తొలగింపు

2

9ఎడికె1- వెంపరాల మేజర్‌లో పూడిక, చిల్లచెట్లు తొలగిస్తున్న ఎక్స్‌కవేటర్‌

9ఎడికె2- పసుమర్రు ఎక్స్‌కవేటర్‌తో తొలగిస్తున్న పూడిక

మంత్రి గొట్టిపాటి చొరవతో

యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభం

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

అద్దంకి, అక్టోబరు 9 : సాగర్‌ కాలువలలో పూడిక పేరుకు పోవడం, చిట్ల చెట్లు దట్టంగా పెరగడంతో నీటి ప్రవాహం ముందుకు కదలక పొలాలకు నీరు సరిగా చేరడం లేదు. దీంతో పలు గ్రామాల రైతులు ఇటీవల అద్దంకి బ్రాంచి కాలువపై మంత్రి రవికుమార్‌ పర్యటించే సమయంలో వివరించారు. దీంతో వెంటనే స్పందించిన రవికుమార్‌ అద్దంకి నియోజకవర్గ పరిధిలోని అన్ని మేజర్‌ కాలువలలో వెంటనే పూడికతీత పనులు, చిల్లచెట్ల తొలగింపు చేపట్టాలని ఎన్నెస్పీ అధికారులను ఆదేశించారు. అన్ని మేజర్‌ కాలువలను పరిశీలించి, ఏయే ప్రాంతంలో పూడికతీత, చిల్లచెట్లు తొలగింపు చేపట్టాలో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా రైతుల పంటల సాగుకు ఇబ్బంది లేకుండా ఉండేలా వెంటనే పూడిక తీత పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే ఎక్స్‌కవేటర్‌ యజమానులతో మాట్లాడి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం వెంపరాల, పసుమర్రు మేజర్‌లలో రెండేసి ఎక్స్‌కవేటర్లతో పూడికతీత పనులు పనులు మొదలుపెట్టారు. రెండు, మూడు రోజులలో రెండు మేజర్‌లలో ఈ పనులు పూర ్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత మరో రెండు మేజర్‌లలో పనులు ప్రారంభించనున్నారు. మంత్రి గొట్టిపాటి వెంటనే స్పందించి నిధుల కోసం ఎదురు చూడకుండా యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించడంతో నీటి విడుదలకు అడ్డంకులు తొలగనున్నాయి. పూడికతీత పనులు చేపట్టడంపట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:12 AM