తుఫాను నష్టంపై ప్రభుత్వానికి నివేదిక
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:32 PM
దుకాణాలతో పాటు ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఏదైనా నేరం జరిగినప్పుడు త్వరగా గుర్తించవచ్చని మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు అన్నారు.
పుల్లలచెరువు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): దుకాణాలతో పాటు ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఏదైనా నేరం జరిగినప్పుడు త్వరగా గుర్తించవచ్చని మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు అన్నారు. సోమవారం వార్షిక తనీఖీల్లో భాగంగా పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించా రు. రికార్డులను తనీఖీ చేశారు. ముందుగా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 45 సీసీ కెమెరాలను ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నా టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో కేసుల దర్యాప్తు వేగవంతం అవు తుందని అన్నారు. దుకాణదారులు, వ్యాపార సంస్థల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను కొంత వరకు అరికట్టవచ్చునని అన్నారు. యాక్సిడెంట్ కేసులను కూడా త్వరగా గుర్తించవచ్చునని అన్నారు. దాతలు, సర్పంచుల సహకారంతో మండలంలోని పుల్లలచెరువు, యండ్రపల్లి, కొత్తూరు, ఐటివరం, మల్లాపాలెం, ఆర్.ఉమ్మడివరం, అక్కపాలెం, మర్రివేముల, ముటుకుల గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను దాతల సహాయంతో ఏర్పాటు చేయించడంపై ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ను అభినందించారు. పోలీసులు ప్రజలతో కలిసి స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. కార్యక్రమంలో వైపాలెం సీపీ ప్రభాకర్‌రావు, ఎస్‌ఐ సంపత్ కుమార్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.