Vijaypal: ముగిసిన విజయ్‌పాల్ విచారణ.. ఏం తేలింది
ABN , Publish Date - Dec 14 , 2024 | 03:31 PM
Andhrapradesh: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్ విచారణ ముగిసింది. రెండు రోజుల పాటు విజయ్‌పాల్‌ను ఎస్పీ దామోదర్ విచారించారు. నేటితో విచారణ ముగియడంతో గుంటూరు జిల్లా జైలుకు ఆయనను తరలించారు.
ప్రకాశం, డిసెంబర్ 14: ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు (AP Deputy Speaker Raghuram Krishnam Raju) కస్టోడియల్ టార్చర్ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ విచారణ ముగిసింది. రెండు రోజుల పాటు విజయ్ పాల్‌ను పోలీస్ కస్టడీకి తీసుకుని ఎస్పీ దామోదర్ విచారించారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ జరిగింది. విచారణ ముగియడంతో ఒంగోలు ఎస్పీ కార్యాలయం నుంచి గుంటూరు జైలుకి విజయ్ పాల్‌ను తరలించారు. రాఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో గత నెల 26న విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విజయ్‌పాల్ విచారణకు సహకరించాలేదని పోలీసులు చెబుతున్నారు.
MLC: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపీ మూర్తి ప్రమాణ స్వీకారం
విచారణలో భాగంగా రఘురామ కృష్ణంరాజుపై ముసుగు ధరించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నలుగురిపై ఎస్పీ దామోదర్ ఆరా తీశారు. రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయడం, కస్టోడియల్ టార్చర్‌కు ప్రేరేపించిన వ్యక్తులపై కూడా ఆరా తీశారు. రెండు రోజులు 50కి పైగా విజయ్‌పాల్‌ను దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ ప్రశ్నలు అడిగారు. అయితే తెలియదు, గుర్తు లేదు అంటూ విజయ్‌పాల్ సమాధానాలు దాటవేశారు.
గత నెల 13న కూడా విజయ్‌పాల్‌ను పోలీసులు విచారించారు. మొదటి సారి విచారణలోనూ విజయ్‌పాల్ విచారణకు సహకరించలేదని.. తెలియదు, గుర్తు లేదు అంటూ సమాధానాలు ఇచ్చారు. తరువాత నవంబర్ 26వ తేదీన మరోసారి విచారణకు పిలువగా.. అప్పుడు కూడా దాటవేత ధోరణిలోనే విజయ్‌పాల్ సమాధానాలు ఇచ్చారు. దీంతో అదే రోజు సాయంత్రం విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. ఆ తరువాత గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా విజయ్‌పాల్ ఉన్నారు. పోలీసుల విచారణకు విజయ్‌పాల్ సహకరించని కారణంగా ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని గుంటూరు కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే రెండు రోజుల పాటు విజయ్‌పాల్‌ను విచారించేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న(శుక్రవారం) ఉదయం 10 గంటలకు జైలు నుంచి విజయ్‌పాల్‌ను తీసుకుని నేరుగా ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.
నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు విజయ్‌పాల్‌ను పోలీసులు విచారించారు. ఈరోజు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు ఎస్పీ దామోదర్ విచారించారు. రఘురామను అక్రమంగా అరెస్ట్ చేసిన తరువాత గుంటూరు సీఐడీ కార్యాలయంలో ముసుగులు ధరించి రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించింది ఎవరు అనే కోణంలోనే ఎస్పీ దామోదర్ ఆరా తీశారు. అయితే విచారణలో ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ తెలీదు, మర్చిపోయాను అంటూనే విజయ్ పాల్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ముసుగు ధరించి వచ్చిన వ్యక్తులు ఎవరో కూడా తనకు తెలియదు అని విజయ్‌పాల్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు రఘురామకు కస్డోడియల్ టార్చర్ అనంతరం గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించగా.. ఆయన ఒంటిపై గాయాలు ఉన్నట్లు వైద్యులు రిపోర్టు ఇచ్చినప్పటికీ.. ఆ రిపోర్టును డాక్టర్ ప్రభావతి తారుమారు చేశారని.. అందులో మీ పాత్ర ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరిపారు. ఎన్ని ప్రశ్నలు వేసినప్పటికీ విజయ్‌పాల్ సమాధానాలు ధాటవేశారు. రెండు గంటలకు విచారణ ముగిసిన అనంతరం విజయ్‌పాల్‌ను తిరిగి గుంటూరు జైలుకే తరలించారు.
ఇవి కూడా చదవండి..
Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు
మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..
Read Latest AP News And Telugu News