భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ABN , Publish Date - Dec 20 , 2024 | 10:57 PM
గ్రామాలలో భూసమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తహసీల్దార్ కే.చిరంజీవి తెలిపారు.
మార్కాపురం రూరల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : గ్రామాలలో భూసమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తహసీల్దార్ కే.చిరంజీవి తెలిపారు. మండలంలోని నాయుడుపల్లి సచివాలయం వద్ద శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, వీఆర్‌వో సుబ్బయ్య, టీడీపీ నాయకులు జవ్వాజి రామాంజులరెడ్డి, డీలర్ కందుల శ్రీనివాసరెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం రూరల్ : గ్రామంలో శ్మశానవాటికకు వెళ్లాలంటే మధ్యలో వాగు అడ్డుగా ఉందని, వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని గోళ్లవీడపి గ్రామస్థులు తెలిపారు. వాగుమధ్యలో చెప్టా ఏర్పాటు చేయాలని తహసీల్దారు ఏ బాలకిషోర్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ, కలెక్టర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకుపోతానన్నారు. సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సదస్సులో మొత్తం 13 ఆర్జీలు వచ్చాయని తెలిపారు. వీఆర్వో రాంబాబు, సర్వేయర్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కొనకనమిట్ల : భూసమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని తహసీల్దార్ ఏ.సురేష్ అన్నారు. మండలంలోని చినారి కట్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజలు తమ భూమికి సంబంధించిన పలు సమస్యలపై కార్యాల యాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే స్వగ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రైతులు ఏమైనా రెవెన్యూ సమస్యలు ఉంటే తమ దృషికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. పాసు పుస్తకాలు, ఆన్‌లైన్, వెబ్‌ల్యాండ్, భాగపంపిణీ తదితర సమస్యలకు సంబంధిత పత్రాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే గ్రామంలోనే వెంటనే పరిష్కరిస్తామ న్నారు. ప్రతిఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్విని యోగం చేసుకోవాలన్నారు. చినారికట్ల గ్రామంలో మొత్తం గ్రామసభకు 58 అర్జీలు వచ్చాయి. ఫ్యామిలీమెంబర్ సర్టిఫికేట్ కోసం 4 అర్జీలు రాగా వెంటనే పరిష్కరించారు. పాసుపుస్తకాల ఆన్‌లైన్ చేయమని 19 అర్జీలు, వచ్చినట్లు చెప్పారు. 35 అర్జీలు రేషన్‌కార్డు కోసం, పెన్షన్లు, గృహాల మంజూరు కోసం వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మాధవరెడ్డి, వీఆర్‌వోలు శేకర్‌రెడ్డి, మందా.రమేష్, జానయ్య, దిలీప్‌కుమార్, పలువురు రెవెన్యూ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పొదిలి : గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ షజీదా అన్నారు. మండలంలోని ఆముదాల పల్లి, తీగదుర్తిపాడు, చింతగంపల్లి గ్రామాలలో శుక్ర వారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజలు తమ భూమికి సంబందించిన పలు సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే స్వగ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రైతులు ఏమైనా రెవెన్యూ సమస్యలు ఉంటే తమ దృషికి తీసుకొచ్చినట్లైతే వెంటనే పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నరసింహారావు, సర్వేయర్, వీఆర్‌వోలు, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.