Share News

రెవెన్యూ రికార్డులు విలువైనవి

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:13 AM

రెవెన్యూ రికార్డులు కోట్ల రూపాయల కన్నా విలువైనవని కలెక్టర్‌ వెంకటమరుళి చెప్పారు. మండల పరిధిలోని గవినివారిపాలెంలో శుక్రవారం ప్రారంభమైన రెవెన్యూ సదుస్సుకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ వీఆర్వోలు సక్రమంగా పనిచేస్తే ఎవరికీ సమస్యలు ఉండవన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

రెవెన్యూ రికార్డులు విలువైనవి
రెవెన్యూ సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటమురళి

కలెక్టర్‌ వెంకటమురళి

చీరాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ రికార్డులు కోట్ల రూపాయల కన్నా విలువైనవని కలెక్టర్‌ వెంకటమరుళి చెప్పారు. మండల పరిధిలోని గవినివారిపాలెంలో శుక్రవారం ప్రారంభమైన రెవెన్యూ సదుస్సుకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ వీఆర్వోలు సక్రమంగా పనిచేస్తే ఎవరికీ సమస్యలు ఉండవన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్‌ స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్క రించుకోవాలన్నారు. సదస్సులో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని ఆన్‌లైన్‌ చేస్తామన్నారు. వాటిని పరిష్కరించే బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. భూ కబ్జాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించిందన్నారు. రీ-సర్వే, అడంగల్‌లో చేర్పులు, మార్పులు, సర్వే నెంబర్లు సవరణ, ఆర్‌ఎ్‌సఆర్‌ రికార్డులు, భూమి కొనుగోలు, విక్రయాలు, పేర్లు మార్పిడి, ఆక్రమణలు, నిషేధిత జాబితా నుంచి తొలగించినవాటి వివరాలు తదితరాలకు సంబంధించి ప్రజలు అర్జీల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఆర్డీవో చంద్రఖర్‌నాయుడు మాట్లాడుతూ భూ సంబంధిత అన్ని సమస్యలకు రెవెన్యూ సదుస్సులలో పరిష్కారం దొరుకుతుందన్నారు. సాగునీరు అందకపోయినా, భూ ఆక్రమణలు జరుగుతున్నా వాటిని పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉందన్నారు. ముందుగా తహసీల్దార్‌ గోపికృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు సందేశాన్ని చదవి వినిపించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:13 AM