Share News

రోడ్లు బాగు

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:26 PM

ఎట్ల కేలకు రోడ్లు బాగుపడుతున్నాయి. గుం తల రహిత ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చింది. శనివారం ఆర్‌అండ్‌బీ డీఈ ఎం.నళిని ఎక్స్‌కవేటర్‌కు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు నాయకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు గంజిపాలెం నుంచి రామాపురం వరకు రోడ్డు మ రమ్మతు పనులు ప్రారంభించారు.

రోడ్లు బాగు
రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభిస్తున్న ఆర్‌అండ్‌బీ డీఈ నళిని

యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభం

చీరాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఎట్ల కేలకు రోడ్లు బాగుపడుతున్నాయి. గుం తల రహిత ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చింది. శనివారం ఆర్‌అండ్‌బీ డీఈ ఎం.నళిని ఎక్స్‌కవేటర్‌కు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు నాయకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు గంజిపాలెం నుంచి రామాపురం వరకు రోడ్డు మ రమ్మతు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈ నళిని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దిశానిర్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల మరమ్మత్తుల పనుల్లో భాగంగా చీరాలలో కూడా పనులు ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ జేఈ శ్రీకాంత్‌, కాంట్రాక్టరు సత్యనారాయణ , నాయకులు కౌతవరపు జనార్దనరావు, రమేష్‌, గంజి పురుషోత్తమ్‌, తేలప్రోలు నాగేశ్వరరావు, గుమ్మ వెంకటేష్‌, రాము, మురళి, శంభుప్రసాద్‌, పటాన్‌ గౌస్‌, హరికృష్ణ, మస్తాన్‌రావు పాల్గొన్నారు.

గుంతలు లేని రహదారులే లక్ష్యం

చినగంజాం : గుం తలు లేని రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని టీడీపీ చినగంజాం, ఇంకొల్లు మండల అధ్యక్షులు పొద వీరయ్య, నాయుడు హనుమంతరావులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు సంతరావూరులో శనివారం పనులు ప్రారంభించారు. సంతరావూరు నుంచి ఇంకొల్లు ఆర్‌అండ్‌బీ రోడుకు ప్యాచ్‌ వర్క్‌ పనులకు టీడీపీ నాయకులు, ఆర్‌ అండ్‌బీ అధికారులు భూమి పూ జ కార్యక్రమం నిర్వహించి, పనులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌రెడ్డి పాల నతో రోడ్ల పరిస్థితి అద్వానంగా మారిందని వీరయ్య, హనుమంతరావు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. ఎమ్మెల్యే ఏలూ రి ఆధ్వర్యంలో ఇప్పటికే పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా కోట్లాది రూ పాయిలతో సిమెంట్‌ రో డ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సం క్రాంతి నాటికి గుంతలు లేని సిమెంట్‌ రోడ్ల నిర్మాణమే ప్రభుత్వం ధ్యే యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చీరాల ఆర్‌అండ్‌బీ సబ్‌ డివిజన్‌ డీఈ నళిని, ఏఈ శ్రీకాంత్‌, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు యార్లగడ్డ లక్ష్మి, టీడీపీ ఇంకొల్లు పట్టణ అధ్యక్షుడు మార్క్‌, నాయకులు దేవతోటి నాగరాజు, వెంకటేశ్వర్లు, సురేష్‌, వెంకటరావు, తూమాటి శ్రీను, రాజేష్‌, కర్రి శ్రీను, సునీల్‌, వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇంకొల్లు : గుంతల రహిత ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా ఇంకొల్లు నుంచి సంతరావూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ రహదారి మరమ్మతులకు ప్రభుత్వం రూ.15 లక్షలు నిధులు మంజూరు చేసిందని ఆర్‌అండ్‌బీ జేఈ శ్రీకాంత్‌ తెలిపారు. కార్యక్రమంలో ఇం కొల్లు మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, చిన్నగంజాం మండలపార్టీ అధ్యక్షుడు పొద వీరయ్య, కరి శ్రీనివాసరావు, వలేరు మార్క్‌, గుంజి వెంకట్రావు, టీడీపీ నాయకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:26 PM