Share News

తాగునీటి కోసం సాగర్‌ జలాలు

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:47 AM

తాగునీటి అవసరాల కోసం ప్రకాశం, గుంటూరు ఉమ్మడి జిల్లాలకు ఐదు టీఎంసీల నీటిని సాగర్‌ డ్యాం నుంచి విడుదల చేశారని ఇరిగేషన్‌ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ కె.లక్ష్మీరెడ్డి బుధ వారం తెలిపారు.

తాగునీటి కోసం సాగర్‌ జలాలు

ప్రకాశం, గుంటూరు ఉమ్మడి జిల్లాలకు ఐదు టీఎంసీలు

రేపు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 10: తాగునీటి అవసరాల కోసం ప్రకాశం, గుంటూరు ఉమ్మడి జిల్లాలకు ఐదు టీఎంసీల నీటిని సాగర్‌ డ్యాం నుంచి విడుదల చేశారని ఇరిగేషన్‌ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ కె.లక్ష్మీరెడ్డి బుధ వారం తెలిపారు. దీన్ని జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 98 గ్రామీణ తాగునీటి చెరువులు, నాలుగు పట్టణ ఎస్‌ఎస్‌ ట్యాంకులకు సరఫ రా చేస్తామన్నారు. జిల్లా సరిహద్దుకు ఈనెల 12వతేదీకి నీరు చేరుతుంద న్నారు. పది రోజులపాటు నీటి సరఫరా జరిగే అవకాశం ఉందన్నారు. సాగర్‌ జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున తాగునీటి చెరువు లు నింపి మూడు, నాలుగు నెలలపాటు జాగ్రత్తగా వినియోగించుకోవా ల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయకట్టు రైతులు కూడా వర్షాధార పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ నీటి సరఫరా, జలవనరుల శాఖ, ప్రజారోగ్య, మునిసిపల్‌, రెవెన్యూ, పోలీస్‌శాఖల పర్యవేక్షణలో చెరువులను నింపుతామని ఆయన తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 01:47 AM