రామతీర్థం రహదారికి మోక్షం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:29 AM
చీమకుర్తి మండల పరిధిలోని రామతీర్థం-మర్రిచెట్లపాలెం మధ్య అధ్వానంగా రాష్ట్ర రహదారి కర్నూల్‌రోడ్ మరమ్మతులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత ఐదేళ్లపాటు ఈ అధ్వాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తూ వాహనదారులుకు నరకప్రాయంగా మారింది.
1.15కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం
చీమకుర్తి, డిసెంబరు6(ఆంధ్రజ్యోతి): చీమకుర్తి మండల పరిధిలోని రామతీర్థం-మర్రిచెట్లపాలెం మధ్య అధ్వానంగా రాష్ట్ర రహదారి కర్నూల్‌రోడ్ మరమ్మతులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత ఐదేళ్లపాటు ఈ అధ్వాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తూ వాహనదారులుకు నరకప్రాయంగా మారింది. గత వైసీపీ పాలనలో రహదారికి కనీసం మరమ్మతులు కూడా నిధులు మంజూరుకు నోచుకోక వందల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జిల్లా పశ్చిమ ప్రకాశానికి ముఖద్వారంగా ఉన్న ఈ ప్రాంతంలో అనునిత్యం వేలకొలది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక ఈప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ విస్తరించటంతో భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ తమీమ్ అన్సారియ సైతం ఇక్కడ ఉన్న ప్రమాదకర పరిస్థితులను చూసి తక్షణమే శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా రూ.1.15కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపడ, అనుమతి మంజూరు చేయటం చకచకా జరిగాయి. నిర్మాణ పనులు దక్కించుకున్న సాయినాథ కాంట్రాక్ట్ సంస్థ శుక్రవారం పనులు ప్రారంభించింది. నెలరోజుల్లోనే నిర్మాణ పనులు పూర్తిచేస్తామని ఆ సంస్థ అధినేత మేదరమెట్ల శ్రీనివాసరావు తెలిపారు.