Share News

సా..గుతున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను

ABN , Publish Date - Jul 02 , 2024 | 10:40 PM

అదిగో రైలు వచ్చేసింది.. ఏప్రిల్‌ నుంచి రాకపోకలు కొనసాగిస్తాం.. ఇకనుంచి రైళ్ల ద్వారా సురక్షిత ప్రయాణం చేయవచ్చని అధికారులు చెప్పిన మాటలు నీటిమూటలవుతున్నాయి. ఇప్పటివరకు రైల్వే లైను నిర్మాణం కూడా పూర్తికాలేదు. భవన నిర్మాణం మధ్యలో ఉం ది. మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయి.

సా..గుతున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను
దర్శిలో ఒకవైపు మాత్రమే పూర్తయిన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను

దర్శిలో ఆగిన స్టేషన్‌ భవన నిర్మాణం

ఇప్పట్లో రైళ్లు తిరిగే అవకాశాలు లేనట్లే

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు

దర్శి, జూలై 2: అదిగో రైలు వచ్చేసింది.. ఏప్రిల్‌ నుంచి రాకపోకలు కొనసాగిస్తాం.. ఇకనుంచి రైళ్ల ద్వారా సురక్షిత ప్రయాణం చేయవచ్చని అధికారులు చెప్పిన మాటలు నీటిమూటలవుతున్నాయి. ఇప్పటివరకు రైల్వే లైను నిర్మాణం కూడా పూర్తికాలేదు. భవన నిర్మాణం మధ్యలో ఉం ది. మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పట్లో రైళ్లు తిరిగే ప రిస్థితి కనిపించటం లేదు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణ పను లు చేపట్టి పది సంవత్సరాలు కావస్తుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో కూడా చేర్చారు. 2014 నుంచి 2019 వరకు కొంత మేరకు చురుగ్గా జరిగాయి. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభు త్వం పూర్తి సహకారం అందించలేదు. రైతులకు చెల్లించాల్సిన నష్ట పరి హారం విషయంలో కొంతమంది పేచీలు పెట్టి కోర్టుకు వేశారు. రాష్ట్ర ప్ర భుత్వం ఆ సమస్యలను తీర్చకుండా ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా నిర్ల క్ష్యం చేయడంతో పనులు తీవ్ర జాప్యం అయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్ని కల ముందు రైల్వే శాఖ అధికారులు నానా హడావుడి చేశారు. నడికుడి నుంచి దర్శి వరకు రోజుకు రెండు రైళ్లు ముందుగా నడుపుతారు.. గత ఏ ప్రిల్‌ నుంచి రాకపోకలు కొనగుతాయన్నారు. రైల్వే లైను పరిశీలన చేసేం దుకు ట్రైలర్‌గా ఒక రైలు, ఒక గూడ్స్‌ను రెండు నెలల క్రితం ఇక్కడకు పంపారు. ఆ రైళ్లు చూసిన ప్రజలు ఇక రాకపోకలు కొనసాగుతాయని ఆ నందం వ్యక్తం చేశారు. వచ్చిన రైళ్లను చూసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్లారు. ఎన్నికల తర్వాత పనులు మరింత మందగించాయి. రైళ్లు నడిపే విషయం గురించి అధికారులు పట్టించుకోలేదు. కనీసం రైల్వే స్టేషన్‌ భవనం కూడా నిర్మాణం మధ్యలో ఉండటంతో ఇప్పట్లో రైళ్లు తిరిగే పరిస్థితి కనిపించటం లేదు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూ టమి ప్రభుత్వాలు అధికారం లోకి రావటంతో ఇకనుంచి అయినా పనులు వేగవంతం అవుతాయని ఆశిస్తున్నారు.

Updated Date - Jul 02 , 2024 | 10:40 PM