Share News

సారస్వత నికేతనం వేటపాలెంకు వరం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:34 PM

సారస్వత నికేతనం గ్రంథాలయం వేటపాలెంకు వరమని మాజీ ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన వేటపాలెం సారస్వత నినేతనం గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో భద్రపరిచిన మహాత్మాగాంధీ చేతికర్రను స్పృశించారు.

సారస్వత నికేతనం వేటపాలెంకు వరం
రమేష్‌ కుమార్‌కు బొకే అందజేస్తున్న గ్రంథాలయ ప్రతినిధులు

మాజీ ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌

వేటపాలెం(చీరాల), అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి) : సారస్వత నికేతనం గ్రంథాలయం వేటపాలెంకు వరమని మాజీ ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన వేటపాలెం సారస్వత నినేతనం గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయంలో భద్రపరిచిన మహాత్మాగాంధీ చేతికర్రను స్పృశించారు. పుస్తకాలు, దిన, వార, పక్ష, మాస పత్రికల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నేటికి చెక్కుచెదరకుండా ఉన్న తాళపత్ర గ్రంథాలను ఆయన పరిశీలించారు. వాటి విశిష్టతను తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని సందర్శించిన ప్రముఖులు అక్కడున్న పుస్తకంలో తమ అనుభూతిని వివరిస్తూ రాసిన విషయాలను తెలుసుకున్నారు. తన అనుభూతిని, అనుభవాన్ని రమే్‌షకుమార్‌ ఆ పుస్తకంలో పొందుపరిచారు. గ్రంథాలయ కమిటీ సెక్రటరీ పి.వెంకట్‌, లైబ్రేరియన్‌ వల్లీ గ్రంథాలయ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల సంఘం ప్రతినిధులు రమేష్‌ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ, పట్టభద్రుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:34 PM