Share News

ఇసుక యార్డులకు ఏజెన్సీలు ఎంపిక

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:21 AM

జిల్లాలో ఆరు ఇసుక యార్డులకు ఏజెన్సీలను ఎంపిక చేసినట్లు జిల్లా ఇసుక కమిటీ మెంబర్‌ కన్వీనర్‌, మైనింగ్‌ అధికారి రాజశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు యార్డులకు 13 ఏజెన్సీల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. ఒంగోలుకు ఆరు, ఎర్రగొండపాలెంనకు 3, కనిగిరి, గిద్దలూరు, దర్శి, మార్కాపురంలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయన్నారు.

ఇసుక యార్డులకు ఏజెన్సీలు ఎంపిక

కొన్నింటికి లాటరీ పద్ధతిలో ఖరారు

ఒంగోలు క్రైం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరు ఇసుక యార్డులకు ఏజెన్సీలను ఎంపిక చేసినట్లు జిల్లా ఇసుక కమిటీ మెంబర్‌ కన్వీనర్‌, మైనింగ్‌ అధికారి రాజశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు యార్డులకు 13 ఏజెన్సీల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. ఒంగోలుకు ఆరు, ఎర్రగొండపాలెంనకు 3, కనిగిరి, గిద్దలూరు, దర్శి, మార్కాపురంలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయన్నారు. ఒంగోలు, వైపాలెం యార్డులకోసం వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిన ఎంపిక చేశామన్నారు. మిగిలిన నాలుగు ప్రాంతాలలో ఒక్కో దరఖాస్తు మాత్రమే రావడంతో వారికే కేటాయించారు. ఒంగోలులో టన్ను రూ.980, గిద్దలూరులో రూ.1,200, మార్కాపురంలో రూ.1,280, వైపాలెంలో రూ.1,500, కనిగిరిలో రూ.980, దర్శిలో రూ.1,230కు ఇసుకను విక్రయించాలన్నారు. అదేవిధంగా యార్డులకు ఎంపికైన ఏజెన్సీలు వెంటనే ఇసుక విక్రయాలకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించినట్లు రాజశేఖర్‌ చెప్పారు.

Updated Date - Nov 16 , 2024 | 01:21 AM