Share News

కనిగిరిలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు హర్షణీయం

ABN , Publish Date - Nov 13 , 2024 | 10:51 PM

కనిగిరిలో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డీవీ(దొడ్డా) వెంకటసుబ్బారెడ్డి చెప్పారు.

కనిగిరిలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు హర్షణీయం
మాట్లాడుతున్న దొడ్డా వెంకటసుబ్బారెడ్డి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డీవీ సుబ్బారెడ్డి

కనిగిరి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : కనిగిరిలో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డీవీ(దొడ్డా) వెంకటసుబ్బారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో బుధవారం కనిగిరిలో కూటమి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమప్రాంతంలోని కనిగిరి అన్ని విధాలా వెనుకబడి ఉందన్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుతం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ప్రచార పర్యటనల్లో భాగంగా కనిగిరి ప్రాంతం అభివృద్ధికి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6నెలలు కూడా గడవక ముందే వెలిగొండ పూర్తికి రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ కేటాయించటం పాలనాధక్షతకు నిదర్శనమన్నారు. అదేవిఽధంగా నిమ్జ్‌ ఏర్పాటు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర.. చంద్రబాబు దృష్టికి తీసుకవెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఆ హామీ మేరకు కనిగిరి ప్రాంతంలో రిలయన్స్‌ బయోగ్యాస్‌ ఏర్పాటుకు కంపెనీతో ఒప్పందం చేయించటంపై సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకే్‌షకు, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, టీజీ భరత్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం కనిగిరి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీవీఆర్‌ మనోహర రావు(చిరంజీవి), మైనారిటీ నాయకులు రోషన్‌ సంధాని, సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్‌), నంబుల వెంకటేశ్వర్లు, తమ్మినేని శ్రీనివాసుల రెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, ఫిరోజ్‌, గంగవరపు నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ షేక్‌ వాజిదాబేగం, కరణం అరుణ, స్వప్న, చీకటి వెంకటసుబ్బయ్య, డీ శివకాశయ్య, దింటకుర్తి సుబ్రమణ్యం, తిరుపాలు, ఐవీ నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 10:51 PM