Share News

గ్రామసభలతో భూ సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Oct 30 , 2024 | 12:28 AM

గ్రామసభల ద్వారా భూసమస్యలు పరిష్కారించేందుకు వీలుం టుందని తహసీల్దార్‌ కృష్ణారెడ్డి అన్నారు.

గ్రామసభలతో భూ సమస్యలకు పరిష్కారం

పొదిలి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామసభల ద్వారా భూసమస్యలు పరిష్కారించేందుకు వీలుం టుందని తహసీల్దార్‌ కృష్ణారెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని కొండాయపాలెం గ్రామంలో సర్పంచ్‌ సన్నెబోయిన మాధవి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ, గ్రామాల్లో పేరుకు పోయిన సమస్యలపై ప్రభుత్వ అదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామాల్లో జరిగిన భూమి రీసర్వేల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

భూసమస్యలు పరిష్కరిస్తాం

తర్లుపాడు : రీసర్వేలో జరిగిన అవకతవకలను గ్రామసభల్లో పరిష్కరించనున్నట్లు తహసీల్దార్‌ విజయ భాస్కర్‌ అన్నారు. మండలంలోని సీతా నాగులవరంలో రీసర్వేపై భూసమస్యలు పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూములకు పాసుపుస్తకాలలో హెచ్చు తగ్గులున్నాయని అర్జీలు సమర్పించారు. వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో మండల సర్వేయర్‌ శ్రీవాణి, గ్రామసర్పంచ్‌ తాడికొండ ఆంజనేయులు, వీఆర్‌వో ఆదినారాయణ, విలజ్‌ సర్వేయర్లు మస్తాన్‌వలి, నాగేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:28 AM