Share News

రెవెన్యూ సదస్సులతో భూసమస్యల పరిష్కారం

ABN , Publish Date - Dec 24 , 2024 | 10:42 PM

రెవె న్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారమవు తాయని ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ అన్నారు. మంగ ళవారం పులిపాడులో జరిగిన సదస్సులో ఆయన మాట్లా డారు. మండలంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను గ్రామ సభల్లో పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, భూముల సరిహద్దుల తేడాలు వంటివి పరిష్కరిస్తున్నట్టు చెప్పారు.

రెవెన్యూ సదస్సులతో భూసమస్యల పరిష్కారం
దర్శి: తూర్పుచవటపాలెంలో అర్జీలు స్వీకరిస్తున్న ఆర్‌డీవో కేశవర్ధన్‌రెడ్డి, పాల్గొన్న తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ తదితరులు

ముండ్లమూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రెవె న్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కారమవు తాయని ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ అన్నారు. మంగ ళవారం పులిపాడులో జరిగిన సదస్సులో ఆయన మాట్లా డారు. మండలంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను గ్రామ సభల్లో పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, భూముల సరిహద్దుల తేడాలు వంటివి పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఇనామ్‌, వాగు పోరంబోకు, కుంట పోరంబోకు లాంటి భూములు మాత్రం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్క రిస్తామన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయర్‌ కోటం రాజు, ఆర్‌ఐ పీవీఎస్‌ఆర్‌ మూర్తి, వీఆర్‌వోలు జి.కోటయ్య, బ్రహ్మతేజ, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు గణపం వెంకటేశ్వరరెడ్డి, ఏరేసు వెంకటేశ్వరరెడ్డి, తదిత రులు పాల్గొన్నారు.

పామూరులో 12 అర్జీలు

పామూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవె న్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తహసీ ల్దార్‌ బీవీ రమణారావు తెలిపారు. మంగళవారం మండ లంలోని అయ్యవారిపలి, కోడిగుంపల గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా అయ్యవారిపల్లి గ్రామంలో ఏడు, కోడిగుంపలలో ఐదు అర్జీలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీటీ బ్రహ్మయ్య, ఆర్‌ఐ బి.మల్లికార్జునరావు, ఎండోమెంట్‌ ఈవో నరసింహాబాబు, విలేజ్‌ సర్వేయర్‌ మానస, వీఆ ర్వో మహ్మద్‌ రఫి, టీడీపీ గ్రామ అధ్యక్షుడు మార్నేని మాల్యాద్రి, పునుగుబాటి మాల్యాద్రి, ఎం.రామకృష్ణ, కొల్లా కిష్టయ్య, కొప్పల్లి నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులకు విశేష స్పందన

దర్శి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల ద్వారా ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కారమవుతున్నాయని కనిగిరి ఆర్‌ డీవో కేశవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని తూర్పుచవటపాలెంలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీ కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదన్నారు. రికార్డుల క్రమబద్ధీకరణ, ఆన్‌ లైన్‌ తదితర సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతున్నాయన్నారు. ఈఅవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం. శ్రావణ్‌కుమార్‌, ఆర్‌ఐ పరిటాల శ్రీనివాసరావు, తదితరు లు పాల్గొన్నారు.

భూసమస్యలను పరిష్కరించుకోవాలి

కనిగిరి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సద స్సుల్లో భూ సమస్యలను పరిష్కరించుకోవాలని తహసీ ల్దార్‌ అశోక్‌రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని పోలవరం, కలగట్ల గ్రామాల్లో జరిగిన రె వెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూముల సమ స్యలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా పరిశీలించి రైతు లకు న్యాయం చేస్తామన్నారు. నిర్దేశిత వ్యవధిలోగా సమ స్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం పేదలకు కేటా యించిన భూమిని అక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తీ సుకుంటామన్నారు. గ్రామాల్లోని వాగు, వంక, పోరంబో కు, అసైన్డ్‌, పశువుల బీడు భూములు ఆక్రమించటం నేరమన్నారు. వాటిని ఆక్రమించిన వారిపై నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు నంబుల వెంకటేశ్వర్లు, సిద్ధాం తి బారాయిమాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 10:42 PM